విజయవాడ: విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు చంద్రబాబును వదలడం లేదు. చంద్రబాబు స్కిల్ కేసును క్లోజ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పిఎంఎల్ఏ కోర్ట్ లో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసింది ఈడీ. స్కిల్ స్కామ్‌లో పాత్రధారులైన డిజైన్ టెక్ పై ఫిర్యాదు నమోదు చేసింది. వికాశ్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌తో పాటు పలువురిపై అభియోగాలు మోపింది.
ఈ కేసులో భారీగా నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ముకుల్ చంద్ర అగర్వాల్,సురేష్ గోయల్ సహకారంతో దారిమళ్లించినట్టు పేర్కొన్న ఈడీ..స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు గుర్తించింది.
2023లోనే రూ. 31.20 కోట్లు ఆస్తులు కూడా అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా మరింత లోతుగా దర్యాప్తు చేసినట్టు వెల్లడించింది. అదనపు విచారణలో ఢిల్లీ, ముంబయి, పూణెలో ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. నిందితులకు చెందిన మరో రూ. 23.54 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. మొత్తం రెండు దఫాలుగా 54.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది. తాజా దర్యాప్తు అంశాలతో కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ని విచారణకు స్వీకరించింది కోర్టు.


