గుంంటూరు: ఏపీలో చట్టం లేదని, రెడ్‌బుక్ పరిపాలన మాత్రమే కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగమే నడుస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ రోజు(శనివారం, జనవరి 31) గుంటూరు నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు అన్నారు. ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ నివేదిక చెప్పింది. టీడీపీ మళ్లీ దుష్ప్రచారం చేస్తూ మళ్లీ ఫ్లెక్సీలు పెట్టింది. ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పా. నన్ను బూతులు తిడుతూ నానా హంగామా చేశారు. నన్ను తిట్టిన వారిని మాత్రమే తిట్టా. నేను చంద్రబాబున బూతులు తిట్టలేదు. నేను తిట్టి ఉండాల్సింది కాదు.. కానీ ఆవేశంలో తిట్టేశా.
నన్ను తిట్టిన వాళ్లను తిట్టడం నా అంతరాత్మకు తప్పనిపించింది. కేసు పెట్టుకుంటే పెట్టుకోండి.. అరెస్ట్ చేస్తే చేసుకోండి. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది నేను అరెస్టుకు సిద్ధం. నాపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెడ్‌బుక్‌కు నా కుక్క కూడా భయపడదు. నాపై దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. ఏపీలో చట్టం లేదు.. రెడ్‌బుక్ పాలనే నడుస్తోంది’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

ఇదీ చదవండి:


