సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) పథకంలోకి తాజా పెట్టుబడులను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులు కుదుటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వెండి ధరలు గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురికావడంతో తాజా పెట్టుబడులకు అనుమతించినట్టు తెలుస్తోంది.
సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్‌లో ఏక మొత్తంలో పెట్టుబడి, క్రమానుగత పెట్టుబడి (సిప్), క్రమానుగత పెట్టుబడి బదిలీ (ఎస్‌టీపీ)లను నిలిపివేస్తున్నట్టు ఈ నెల 14న టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించడం గమనార్హం. ధరలు అనూహ్యంగా పెరుగుతూ వెళుతున్న తరుణంలో రిస్క్ నియంత్రణలో భాగంగా ఈ చర్య చేపట్టింది. మార్కెట్ పరిస్థితులు సాధారణంగా మారడంతో తిరిగి ఏక మొత్తంలో పెట్టుబడులు, తాజా సిప్‌లు, ఎస్‌టీపీలను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా


