హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 25 వరకు బెంగళూరులో ఇమ్‌టెక్స్ ఫార్మింగ్ 2026 ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు ఇండియన్ మెషిన్ టూల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహిని కేల్కర్ తెలిపారు.
మెటల్ ఫారి్మంగ్, తయారీ సాంకేతికతలకు ఇది ఆసియాలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అని ఆమె చెప్పారు. 20 దేశాల నుంచి 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారన్నారు. దేశీయంగా మెషిన్ టూల్ మార్కెట్లో మెటల్ ఫార్మింగ్ వాటా 29 శాతమని తెలిపారు.


