నేను చెప్పేది అదొక్కటే.. మా కుటుంబంలా మీకు జరగ్గకూడదు: ఎన్టీఆర్ | Jr NTR Request To His Fans To Stay Safe At Event In Bangalore And Gave Updates On Upcoming Film, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jr NTR: 'మాలాగా మీకు జరగ్గకూడదు.. నా అభిమానులందరు జాగ్రత్త'

Mar 8 2026 4:50 PM | Updated on Mar 8 2026 6:15 PM

Jr Ntr Request to His Fans at event In Bangalore

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ తన అభిమానుల గురించి మాట్లాడారు. బెంగళూరులో ఓ ఆ‍స్పత్రి కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. నా కుటుంబంలో జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని అన్నారు. ఇంతలా నాకు ప్రేమ అందించిన మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నా కోసం వచ్చిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన మీకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటా. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా' అని అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే జోర్డాన్‌లో పూర్తి చేశారు. ఈ షూట్‌లో ఎన్టీఆర్‌పై యాక్షన్ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి ముందే డ్రాగన్‌ టీమ్ ఇండియాకు చేరుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ డ్రాగన్‌ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement