పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్! | Know Reasons Behind Why Pawan Kalyan Ustaad Bhagat Singh Premieres Postponed, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh: రిస్క్ చేయని ఉస్తాద్.. 'ధురంధర్ 2' ప్రభావమేనా?

Mar 8 2026 5:15 PM | Updated on Mar 8 2026 6:35 PM

Ustaad Bhagat Singh Movie No Premieres

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.

(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)

ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.

'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్‌లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement