చట్టాన్ని నమ్ముతుంది | Samyuktha in a powerful avatar in womens day special poster from black gold | Sakshi
Sakshi News home page

చట్టాన్ని నమ్ముతుంది

Mar 9 2026 12:23 AM | Updated on Mar 9 2026 12:23 AM

Samyuktha in a powerful avatar in womens day special poster from black gold

ఒకవైపు బొగ్గుతో నిండిన రైలు దూసుకెళుతోంది... మరోవైపు బాంబు పేలిన దృశ్యం. మైనింగ్‌ ప్రాంతంలో సంయుక్త గన్‌ పట్టుకుని గురి చూస్తున్నారు. మరి... ఆమె ఆపరేషన్‌ ఏంటి? అనేది ‘ది బ్లాక్‌ గోల్డ్‌’లో చూడాలి. సంయుక్త లీడ్‌ రోల్‌లో ఈ హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ రూపొందుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని మైనింగ్‌ ఏరియాలో యాక్షన్‌ మోడ్‌లో ఉన్న సంయుక్త పోస్టర్‌ని విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ‘ఆమె చట్టాన్ని నమ్ముతుంది.... తుపాకీని కాదు’ అనే క్యాప్షన్‌ ఉంది. ఈ చిత్రాన్ని యోగేష్‌ కేఎంసి దర్శకత్వంలో మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ వేసవిలో విడుదల చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement