మరో సినిమా ఒప్పుకున్న ధురంధర్‌ హీరోయిన్‌?! | Mukesh Chhabra gives Clarity about Sara Arjun Heer Ranjha | Sakshi
Sakshi News home page

ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమా చేయనున్న సారా?

Mar 9 2026 1:27 PM | Updated on Mar 9 2026 1:59 PM

Mukesh Chhabra gives Clarity about Sara Arjun Heer Ranjha

ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అలరించిన సారా అర్జున్‌ ఇప్పుడు హీరోయిన్‌గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్‌ 2తో ముందుకు రాబోతోంది.

రూమర్స్‌పై క్లారిటీ
అయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్‌ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సారా.. హీర్‌ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్‌పై కాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్‌ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. 

నేనే చెప్తా..
ప్రస్తుతం మేమంతా ధురంధర్‌ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్‌ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్‌ 2 తర్వాతే సారా తన నెక్స్ట్‌ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 

సినిమా
ధురంధర్‌ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్‌ 2 వస్తోంది. అర్జున్‌ రాంపాల్‌, సంజయ్‌ దత్‌, ఆర్‌.మాధవన్‌, రాకేశ్‌ బేడీ, సారా అర్జున్‌ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్‌ ఇండియావైడ్‌గా విడుదల కానుంది.

 

 

చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు

Advertisement
 
Advertisement
Advertisement