పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్‌ మేనమామ | Vijay Devarakonda Uncle Yash Rangineni Reveals Interesting Things About Virosh Love Story And Marriage | Sakshi
Sakshi News home page

Virosh: విజయ్‌ లవ్‌ మ్యాటర్‌ ఇంట్లో చెప్పగానే అమ్మానాన్న..

Mar 8 2026 5:45 PM | Updated on Mar 8 2026 6:47 PM

Vijay Devarakonda Uncle Yash Rangineni about Virosh

చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్‌ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్‌ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్‌ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్‌ అవదని అంటుంటేవాడని విజయ్‌ మేనమామ, నటుడు, నిర్మాత యశ్‌ రంగినేని చెప్తున్నాడు.

పెళ్లి వద్దని..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్‌ రంగినేని మాట్లాడుతూ.. విజయ్‌ పెళ్లి గురించి పాజిటివ్‌గా ఉండేవాడు కాదు. కెరీర్‌ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్‌ కామ్రేడ్‌ నుంచి విరోష్‌ (విజయ్‌- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. 

ఇంట్లో చెప్పగానే..
ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్‌ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్‌.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్‌ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. 

తలరాత చెప్పలేం
ఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్‌ను రౌడీ బాయ్‌లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్‌. టాక్సీవాలా రిలీజ్‌కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. 

దుఃఖం ఆపుకోలేక..
ఆ విషయం తెలిసి విజయ్‌ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్‌ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్‌ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్‌కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆ ఫోన్‌ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ

Advertisement
 
Advertisement
Advertisement