రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే? | Vijay Devarakonda responds on Rashmika Wins Gaddar Film Award | Sakshi
Sakshi News home page

Vijay - Rashmika: రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే?

Mar 9 2026 10:17 AM | Updated on Mar 9 2026 10:34 AM

Vijay Devarakonda responds on Rashmika Wins Gaddar Film Award

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌ వేదికగా జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఈ జంట  ఒక్కటయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు.

అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్స్ అవార్డ్స్‌లో తన భార్య రష్మికకు ఉత్తమ నటిగా ఎంపికైంది. ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రానికి గానూ ఈ అవార్డ్‌ దక్కింది. ఈ సందర్భంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు అవార్డ్‌ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. హ్యాపీ అండ్ ప్రౌడ్‌ అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక భర్త పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. విజ్జు.. నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి ఒకరినొకరు అభినందించుకోవడం విశేషం.

 rashmika

Advertisement
 
Advertisement
Advertisement