breaking news
Gaddar Awards
-
ది 100 సినిమాను ఫస్ట్ డే చూస్తాను: తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
‘‘మంచి సందేశంతో ‘ది 100’ సినిమా నిర్మించారు. పోలీసాఫీసర్‌గా సాగర్ కరెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. ఒక రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ కూడా ఐదుకోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్కే సాగర్ మంచి హీరో అవుతాడనిపిస్తోంది.ఈ సంవత్సరం ‘గద్దర్ అవార్డ్స్’లో బెస్ట్ ఫిల్మ్‌గా ‘ది 100’ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని నేను రికమండ్ చేయడం లేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఇక పైరసీ వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం పోలీస్ అధికారులతో మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరిగింది’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్ హీరో ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. ఈ చిత్రంలో హీరోయిన్లు మిషా నారంగ్, ధన్య బాలకష్ణ నటించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపు, జె. తారక్ రామ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘ది 100’ సినిమా చూశాను. ఒక పవర్ఫుల్ యాక్టింగ్‌తో మంచి సోషల్ మెసేజ్ చెప్పడానికి దర్శకుడు శశి మంచి ప్రయత్నం చేశారు. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంతవాసి. టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు... హాలీవుడ్‌లోనూ రాణించగల ప్రతిభ సాగర్‌లో ఉంది. ఐపీసీలోని మంచి సెక్షన్ లోని సారాంశంతో ‘పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్సెల్ఫ్’ అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. ఈ రోజు ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు రావాల్సింది. కానీ ఆయనకు మరో కార్యక్రమం ఉండటం వల్ల, మాకు తెలియజేయడం జరిగింది’’ అన్నారు శ్రీధర్‌బాబు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ– ‘‘ఐటీ మినిస్టర్ శ్రీధర్ అన్నగారు నా సినిమా చూసి, నన్ను ఆశీర్వదించారు. అలాగే నా కోసం ఈ వేడుకకు వచ్చిన వెంకట్‌రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎస్. గోపాల్‌రెడ్డి, కోదండ రామిరెడ్డి, డైరెక్టర్ బి.గోపాల్ గార్లు... వాళ్ల ఫ్యామిలీలో నన్ను చేర్చుకున్నందుకు థ్యాంక్స్. ‘ది 100’ అనేది ఒక వెపన్ . కొందరు సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించినప్పుడు, వాళ్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు’’ అని అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ– ‘‘ఓ రియల్ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన విని, ఇలాంటివి కూడా జరుగుతున్నాయా? అనిపించి, ఈ పాయింట్‌ను చె΄్పాలనుకున్నాను.ఈ చిత్రంలో మహిళల గురించీ చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం’’ అని చె΄్పారు. ‘‘ది 100’లో ఎంటర్టైన్ మెంట్‌తో పాటు మంచి సందేశం ఉంది’’ అన్నారు నిర్మాత రమేశ్. ‘‘ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబుగార్లకు, మిగతా పెద్దలందరికీ థ్యాంక్స్’’ అని నిర్మాత వెంకీ చె΄్పారు. ఈ వేడుకలో ఎ. కోదండ రామిరెడ్డి, బి. గోపాల్, ఎస్. గోపాల్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ‘ది 100’ చిత్రబృందంలోని పలువురు పాల్గొన్నారు. -
యంగ్ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత
యంగ్ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు. బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ.. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా, మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా, 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం (బెస్ట్ సెకండ్ ఫిల్మ్) విభాగంలో తేజసజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది.బాల నటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకొని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. హనుమాన్ తరువాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
గద్దర్ అవార్డ్స్‌లో గ్లామర్ క్వీన్స్.. స్పెషల్ ఫోటోలు చూశారా..?
-
ఇదేంటి బాలయ్య.. డీసీఎం పేరు మర్చిపోయావా!
-
ప్రభుత్వ అవార్డులను స్వీకరించడం మన బాధ్యత: ‘దిల్’ రాజు
‘‘ప్రభుత్వ అవార్డులను స్వీకరించాలి. షూటింగుల్లో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించడం మన బాధ్యత. ప్రభుత్వంతో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిదీ. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి అవార్డులు ప్రకటించినప్పుడు ఆ తేదీలను డైరీలో నోట్ చేసుకుని, ఒకవేళ మీకు అవార్డు ఉంటే ఆ అవార్డును స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్. అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవార్డులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకు రెండు కళ్లు’’ అని అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీష్ ఐఏఎస్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలం గాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అవార్డులు స్వీకరించిన అందరికీ ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. తెలంగాణ సీయం రేవంత్‌రెడ్డిగారికి స్పెషల్ థ్యాంక్స్.సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ఈవెంట్లో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చేమో. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి, ఈవెంట్‌కు వచ్చినవారు ఒకవేళ హర్ట్ అయితే ఎఫ్డీసీ తరఫున చైర్మన్‌గా క్షమాపణలు కోరుతున్నాను’’ అని అన్నారు. ‘‘సీయం రేవంత్ రెడ్డిగారి ఆదేశాలతో, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారి గైడెన్స్‌తో, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారి విజన్‌తో తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకున్నాం. ఈ సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరీ కృతజ్ఞతలు’’ అన్నారు ఎఫ్డీసీ ఎండీ హరీష్. -
ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డుల వేడుక జరిపింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఈ వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకని దగ్గరుండి విజయవంతం చేసిన దిల్ రాజు.. తాజాగా మీడియాతో మాట్లాడారు. అవార్డ్స్ వేడుక సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవంపై ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. 'గద్దర్ అవార్డ్స్ వేడుకలు నిన్న భారీ ఎత్తున నిర్వహించాం. ఆ ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈ అవార్డ్స్ వేడుక కోసం గత 6 నెలలు నుంచి వర్క్ చేశాం. ఇది పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవార్డ్ గ్రహీతలందరికీ థాంక్స్. ముఖ్యమంత్రి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం.. రెండు గంటలు పైన ఉన్నారు. త్వరలో ఏపీలో కూడా అవార్డ్స్ మొదలవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించే వాళ్లు ఎన్ని పనులున్నా కచ్చితంగా వచ్చి స్వీకరించాలి ఇది నా రిక్వెస్ట్' అని చెప్పుకొచ్చారు.అలానే ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో సినీ పరిశ్రమ తీరుపై ఏఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయింది. ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే అందరూ హాజరై తీసుకోవాలి. అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ అవార్డు కోసం కేటాయించాలి. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని దిల్ రాజు కోరారు.ఈ వేడుకలో 'పుష్ప 2' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ స్వీకరించగా, ఉత్తమ నటిగా '35: ఇది చిన్న కథ కాదు' సినిమాకుగాను నివేదా థామస్ పురస్కారం అందుకుంది. గతేడాది అన్ని విభాగాలకు అవార్డులు బహుకరించగా.. 2014 నుంచి 2023 వరకు మాత్రం మూడేసి ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇచ్చారు. గ్రహీతలకు సిల్వర్ మొమెంటో, ప్రశాంసా పత్రం, రూ.5 లక్షల మొత్తాన్ని అందజేశారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?) -
టాలీవుడ్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే హీరోయిన్లు.. టాలెంట్‌తో పాటు ఫిజిక్ కూడా మెంటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు బ్యూటీస్ మాత్రం గ్లామర్‌ని నమ్ముకోకుండా యాక్టింగ్‌తో అలరిస్తూ ఉంటారు. నటనకు స్కోప్ ఉండే మూవీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లలో నివేదా థామస్ ఒకరు. తాజాగా గద్దర్ అవార్డుల్లో కనిపించిన ఈమె.. అందరికీ ఓ రకంగా షాకిచ్చింది. ఎందుకంటే చాలా మారిపోయింది.(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)కేరళకు చెందిన నివేదా థామస్.. కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటుంది. బాలనటిగానే పలు సినిమాలు చేసిన నివేదా.. 2016లో వచ్చిన నాని 'జెంటిల్‌మేన్' మూవీత తెలుగులోకి హీరోయిన్గా పరిచయమైంది. అనంతరం నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, వి, వకీల్ సాబ్ తదితర చిత్రాల్లో నటించింది. చివరగా '35: ఇది చిన్న కథ కాదు'లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీకే ఉత్తమ నటిగా ఈమెని గద్దర్ అవార్డ్ వరించింది.తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా.. నివేదా థామస్ కూడా హాజరైంది. కానీ పూర్తిగా చబ్బీగా కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈమెని చూసి ఏంటి నివేదా ఇలా మారిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే నివేదా చేతిలో కొత్త సినిమాలేం లేవు. మరి నివేదా ఇంతలా మారిపోవడానికి వేరే ఏదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ) View this post on Instagram A post shared by Actress point 👉 (@actressz_point) -
ఉత్తమ చిత్రంగా కల్కి.. ఈల వేసి రచ్చ చేసిన నాగ్ అశ్విన్ భార్య
-
అప్పుడు ‘నంది’..ఇప్పుడు ‘గద్దర్’..రెంటాల అరుదైన ఘనత
రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ను అందుకున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఉత్తమ తెలుగు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘తెలుగు సినిమాపై వచ్చిన ఉత్తమ రచనల’ కేటగిరీలో జయదేవ రాసిన పుస్తకానికి 2024వ సంవత్సరానికి గాను ఈ గౌరవం లభించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, జయదేవ రచించిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ‘ఉత్తమ సినీ గ్రంథం’గా రాష్ట్ర ప్రభుత్వ జ్యూరీ ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గద్దర్ అవార్డు సిల్వర్ మెమెంటో, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని జయదేవకు అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ప్రతిని ఉప ముఖ్యమంత్రి అందుకొని, రచయితను అభినందించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించడం ఇదే తొలిసారి. ఆ తొట్టతొలి అవార్డే రెంటాల జయదేవను వరించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులుగా పాపులరైన ఈ పురస్కారాల్లో... గతంలో 2011వ సంవత్సరానికి గానూ జయదేవకు ‘ఉత్తమ సినీ విమర్శకుడు’గా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ గౌరవం సైతం అందుకున్నారు. తాజా గద్దర్ అవార్డుతో... అటు నంది, ఇటు గద్దర్... రెండూ సాధించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పురస్కార విజేత అయిన తొలి జర్నలిస్టు అనే అరుదైన రికార్డు జయదేవకు దక్కింది. -
సిద్ శ్రీరామ్ పాటకు ఫిదా అయిన రాజమౌళి, CM రేవంత్, అల్లు అర్జున్
-
సినీ పరిశ్రమకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
-
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నితిన్ జిహాని చౌదరి.. కల్కి సినిమా
-
స్టేజీపై ఇటు సీఎం.. అటు పుష్ప.. ఫైనల్ డైలాగ్ ఇచ్చాడు చూడు
-
గద్దర్ అవార్డ్స్: డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయిన బాలయ్య..వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ స్పీచ్ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో అసలు అర్థమే కాదు. ఏదో చెప్పబోయి.. మరేదో చెబుతుంటారు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులను అవలీలగా చెప్పినా.. బయట మాత్రం చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేక తడబడుతుంటారు. ఆ మధ్య దేశభక్తి గేయం ‘సారే జహాసె అచ్చా’కూడా సరిగ్గా పాడలేక ట్రోలింగ్కి గురయ్యారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయి.. దాన్ని కవర్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట బాగా వైరల్ అయింది.(చదవండి: సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్)శనివారం సాయంత్రం హైటెక్స్‌లో జరిగిన గర్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ఇచ్చి సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అవార్డును అందజేశారు. అనంతరం బాలకృష్ణ వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భట్టి పేరుని మర్చిపోయారు. ఆర్థిక, విద్యుత్ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి..(గ్యాప్ తీసుకున్నాడు).. మల్లు..(గ్యాప్ తీసుకున్నాడు) అంటూ పూర్తి పేరుని పలకడానికి తడబడ్డారు. చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందించడంతో భట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/OMKPh0GUeo— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025 -
కోటి తారల వీణ... సినీ తెలంగాణ
తారలు తళుకులీనాయి... నింగిలోని నక్షత్రాలు కూడా తొంగి చూశాయి. అశ్వత్థామలు, లక్కీ భాస్కర్లు, పుష్పరాజ్‌లు, ఇది చిన్న కథ కాదు అన్నట్టుగా మాదాపూర్ హైటెక్స్‌కు అరుదెంచారు. అలనాడు ఇంటింటా వెలిగిన జయప్రద, జయసుధ, సుహాసినిలను వేదిక మీద చూసి గృహిణిలు తెగ ముచ్చటపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఈ వేడుకకు కర్త, కర్మలై శోభ తెచ్చారు. ఆటలు, పాటలు, కళాప్రదర్శనలు...చూడ్డానికి వెండితెర చాలదు! అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాజమౌళి...చుక్కల్లో చందమామలుగా అభిమానులను అలరించారు. ఇంతకాలం ఎదురుచూసిన సినీ అవార్డుల వేడుకకు తెలంగాణ ప్రభుత్వం పదింతలు అట్టహాసం కలిపి నభూతో అన్నట్టుగా నిర్వహించింది. చిత్రమాలికను చిత్తగించండి...ఇది సినిమా అవార్డ్స్ గనక సరదాగా ఓ డైలాగ్ చెబుతా అంటూ... ‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా... గంగమ్మ జాతరలో యేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప..పుష్పరాజ్..అస్సలు తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలోని డైలాగ్ చెప్పి, అల్లు అర్జున్ అలరించారు. ‘‘ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి భట్టిగారికి, ‘దిల్’ రాజుగారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్‌గారు లేక పోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. డార్లింగ్... ఐ లవ్ యూ. ఈ అవార్డు ప్యూర్‌గా మీ విజన్. ‘పుష్ప’ నిర్మాతలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు టీమ్ అందరికీ ధన్యవాదాలు. రాజమౌళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే... మీరు ఆ రోజు ‘పుష్ప 1’ సినిమాను హిందీలో రిలీజ్ చేయమని చెప్పక పోయి ఉంటే, ఈ రోజు ఇంతటి రేంజ్ ఉండేది కాదు. ధన్యవాదాలు సార్. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డు. ‘పుష్ప 2’ గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ (ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ..)కి థ్యాంక్స్.– నటుడు అల్లు అర్జున్కళామతల్లి ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా గౌరవించి అవార్డులివ్వడం సంతోషం. ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సం పాదించుకున్నారు గద్దర్ అన్న. ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా అవార్డులిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ప్రారంభించాం. ఎంతోమంది ఈ అవార్డుని పొందారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ కొడుకుగా నాన్నగారి అవార్డుని తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా నాకు ఇచ్చిన పది లక్షల నగదును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పతిక్రి ఇచ్చినట్లు భావిస్తున్నాను. ఇందుకు రేవంత్ అన్నకి థ్యాంక్స్. – నటుడు నందమూరి బాలకృష్ణ (ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు) గద్దరన్న పేరు మీద ఈ అవార్డులు ప్రారంభించడం, సినిమా ఇండస్ట్రీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ అవార్డులివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా గర్వకారణమైన మూమెంట్. మహబూబ్‌నగర్‌లో పుట్టిన పిల్లోణ్ని.. కాంతారావుగారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అనేది ఆయనకు నిజమైన నివాళి. ఈ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తిని నేను అయినందుకు చాలా బాధ్యతగా భావిస్తున్నాను.. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. ఈ అవార్డు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కగారికి, ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్’’.– నటుడు విజయ్ దేవరకొండ (కాంతారావు ఫిల్మ్ అవార్డు)పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతోంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ జ్యూరీ వారు సెలెక్ట్ చేశారు. బెస్ట్ ఫిల్మ్‌ను సెలెక్ట్ చేయడానికి జ్యూరీ అన్ని సినిమాలు చూసింది. నేషనల్ అవార్డ్ పొందిన సినిమాలు, రివ్యూస్ వచ్చిన సినిమాలు, కమర్షియల్‌గా బాగా ఆడిన సినిమాలు... ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలుగా జ్యూరీ సెలెక్ట్ చేసింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి ప్రతి సినిమాకి నాలుగు అవార్డులు ఇవ్వడానికి జ్యూరీ కమిటీ అడగడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈరోజు ఆ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే 2024లో అద్భుతంగా, కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలను జ్యూరీ సెలెక్ట్ చేయడం, వారికి కూడా ఈ రోజు అవార్డులు ఇచ్చుకోవడం ఆనందకరం.– ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజుఎన్ని అవార్డులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇండస్ట్రీకి మొదటి నుంచీ చాలా ప్రత్యేకం. ఈ అవార్డుల కోసం వేచి చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిగారు, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు థ్యాంక్స్. మమ్మల్ని ప్రోత్సహించడానికి గద్దర్‌గారి పేరుమీద ఈ అవార్డులు పెట్టడం ఆనందంగా ఉంది. – దర్శకుడు సుకుమార్ (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు)గద్దర్‌గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీ దేవి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. – సంగీత దర్శకుడు కీరవాణిఎక్కడెక్కడ ఏం సాధించినా మన నేల మీద, మన వాళ్ల మధ్య ఇలాంటి గౌరవం పొందడం ఎప్పటికీ మరచి పోలేని విషయం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. – రచయిత చంద్రబోస్గద్దర్ పేరుపై ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవ్వడంతో పాటు గద్దర్ ఫౌండేషన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల రూ పాయలను మంజూరు చేశారు. గద్దర్ తనయుడు, గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యకిరణ్ గద్దర్ ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ గద్దర్ మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కగారికి, రాష్ట్ర మంత్రులు, అవార్డులు స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ అభినందనలు. రేవంత్ అన్నగారి ఆధ్వర్యంలో 31 జనవరి 2024న గద్దర్ ఫౌండేషన్ ని ప్రకటించడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డిగారు ప్రామిస్ చేసినట్లుగానే ఈ అవార్డు వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నాన్నగారి సాహిత్యం, నాన్నగారి విలువలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్ కి రూ. 3 కోట్లు కేటాయించడాన్ని ఫౌండేషన్ తరఫున మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు సార్... ప్రతి సంవత్సరం మీరు చేపడుతున్న కల్చరల్‡అండ్ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్‌కి స్థలం కేటాయిస్తున్నట్లుగా నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్.. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలు (గద్దర్), సినిమా వేడుకలు కూడా అక్కడే చేసుకుందామని కోరుతూ, మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు, భట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను’’ అన్నారు.‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు సాధించిన సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌లను ప్రత్యేకంగా సన్మానించారు -
హాలీవుడ్‌కు వేదికవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్‌కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్‌కు హైదరాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్‌కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. -
సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్ డైలాన్ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్ కదా.. తన సినిమాలోని డైలాగ్‌ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్ ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పాడు. -
ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
హైదరాబాద్‌లోని అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. 2014 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలు, నటీనటులకుగానూ ఈ పురస్కారాల ప్రదానం చేశారు. అవార్డ్‌తో పాటు సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.అవార్డులు అందుకున్న విజేతలు వీళ్లేఉత్తమ నటుడు- అల్లు అర్జున్( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీద్వితీయ ఉత్తమ చిత్రం : పొట్టేల్తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్)ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరుపేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్: పుష్ప2 (సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర-ఆయుధపూజ)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా2)ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్‌కుమార్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అరుణ్ దేవ్ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మోనీ సోషల్ అప్లిస్ట్: కమిటీ కుర్రాళ్లు -
అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక (ఫొటోలు)
-
గ్రాండ్‌గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక్ష ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను అందజేశారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందించారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్‌కు హాజరయ్యారు.'గామి' సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా అద్నితిన్ జిహానీ చౌదరి.. 'కల్కి 2898ఏడీ' సినిమాకు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు- అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు. -
మన 'పైడి జయరాజ్' పేరుతో అవార్డ్.. అందుకోనున్న 'మణిరత్నం'
భారతీయ సినిమా మాటలు నేర్వకముందే అంటే మూకీయుగంలోనే పైడి జైరాజ్ సినీ ప్రయాణం మొదలైంది. భారత తొలి మాటల చిత్రం అలం ఆరా (1931) సినిమాతో తనదైన ముద్ర వేసిన పైడి జైరాజ్ హిందీలో కూడా గుర్తింపు పొందారు. నేడు (జూన్ 14)న తెలంగాణ సర్కారు ఆయన పేరుతో అవార్డు ప్రదానం చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ సెప్టెంబర్ 28, 1909లో జన్మించారు. పంజాబీ అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. 2000 ఆగస్టు 11న ఆయన మరణించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 11 మూకీ సినిమాల్లో 156 టాకీ సినిమాల్లో హీరోగా, 300 సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.1929లో బొంబాయికినిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో జైరాజ్ నాటకలు, సినిమాలపై ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. స్టార్క్లింగ్ యూత్ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతభూమి, ఆల్ ఫర్ లవర్, మహాసాగర్ మోతి, ఫ్లైట్ ఇన్టు డెత్, మై హీరో మొదలైన పదకొండు నిశ్శబ్ద చిత్రాల్లో నటించాడు. శాంతారామ్, అశోక్ కుమార్, పథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ వంటి వారితో ఏడు దశాబ్దాల పాటు కొనసాగారు. నిరూపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ల సరసన నటించారు. 86ఏళ్ల వయసులో 1995లో గన్ అండ్ గాడ్ సినిమా తరువాత సినీరంగం నుంచి తప్పుకున్నారు. టాకీకాలంలో మోహర్, మాల, ప్రతిమ, రాజ్‌ఘర్, సాగర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అమర్‌సింగ్ రాథోడ్, పథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, షాజహాన్, టిప్పు సుత్తాన్, హైదర్ ఆలీ వంటి పా త్రలు పోషించిన ఆయన హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, మలయాళం తదితర భాషా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.పైడి జైరాజ్ సినీ పురస్కారంరాష్ట్ర విభజన నాటి నుంచి 2014–2024 మధ్యలో విడుదలైన చిత్రాలకు గద్దర్ పేరున తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డులైన రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులకు తోడు తెలంగాణకు చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనుంది. సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ పేరున తొలిసారిగా అవార్డు ప్రకటించగా, ఈనెల 14న ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ప్రదానం చేయనున్నారు.తెలుగు సినిమాల సమీక్షల్లో తనదైన ముద్ర వేసి, సినీ రంగం పైన అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసిన కరీంనగర్ ఫిల్మీ సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర పైడి జైరాజ్‌పై నిర్మించిన డాక్యుమెంటరీ గాను 2024 సంవత్సరానికి బెస్ట్ ఫిలిం క్రిటిక్‌గా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును శనివారం హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో రవిచంద్ర అందుకోనున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యులు లక్ష్మీ గౌతమ్, మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, కోల రామచంద్రారెడ్డి, వారాల మహేశ్ తదితరులు అభినందించారు. -
విమాన ప్రమాదం వల్లే మంత్రి రాలేకపోయారు: దిల్ రాజు
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు. లండన్ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గద్దర్ అవార్డుల వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. విమాన ప్రమాదం జరగటం మంత్రి కోమటిరెడ్డి ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.ఇప్పటికే గద్దర్ అవార్డు గ్రహీతలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించామని ఇవాళ నిర్వహించిన ప్రెస్మీట్లో తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేస్తామని ప్రకటించారు. అందరూ తప్పకుండా హాజరైన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని దిల్ రాజు కోరారు. ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శక, నిర్మాతలకు కలిసి నాలుగు అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఇలా ప్రతి ఏడాదిలో మూడు సినిమాలకు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల వేడుక ఈనెల 14న హైదరాబాద్‌లో జరగనుంది. -
‘గద్దర్ అవార్డ్స్’ లో తెలంగాణకు అన్యాయం: ప్రతాని రామకృష్ణ గౌడ్
‘‘తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌గారి పేరుతో అవార్డ్స్(Gaddar Awards) ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే ఈ అవార్డు కమిటీ జ్యూరీకి మురళీ మోహన్ , జయసుధలను చైర్మన్లుగా నియమించడం ఏంటో అర్థం కాలేదు. ఎఫ్డీసీ చైర్మన్‌గా ‘దిల్’ రాజు తన అధికారాలను దుర్వినియోగం చేశారు. తన వాళ్లకే అవార్డ్స్ ఇచ్చుకున్నారు. జ్యూరీ కమిటీలో ఉన్నవాళ్ల సినిమాలకు అవార్డ్స్ ఇవ్వకూడదనే నిబంధనలను పాటించలేదు. థియేటర్స్ బంద్ విషయంలోనూ ‘దిల్’ రాజు ప్రమేయం ఉంది’’ అని ‘తెలంగాణ ఫిలిం చాంబర్’ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. జ్యూరీ కమిటీ సభ్యులు అన్ని సినిమాలు చూడలేదు. థియేటర్స్‌లో పర్సంటేజీ విధానం వల్ల గతంలో లాభాలు ఆర్జించిన డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రస్తుత విధానాల వల్ల నష్టాలు వస్తున్నాయి. 2002 వరకు థియేటర్స్‌లో పర్సంటేజీ విధానం ఉండేది. ఆ తర్వాత నిర్మాత డి. సురేష్ బాబులాంటి కొందరు తమ స్వార్థంతో అద్దె విధానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, ఏషియన్ సునీల్.. లాంటి వాళ్లు సురేష్ బాబు బాటలోనే నడిచి థియేటర్స్‌ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు’’ అన్నారు. ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’లను ప్రభుత్వం పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, నటుడు కిరణ్, తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, తెలంగాణ రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమృత్ గౌడ్ కోరారు. -
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 ఏడాదిగానూ సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా 'పాఠశాల' చిత్రం ఎంపికైంది.మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన 'పాఠశాల' చిత్రాన్ని రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 2014 ఏడాది సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా గద్దర్ సినీ అవార్డ్‌కు ఎంపికైంది.ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారానికి పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 'పాఠశాల' చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోందని అన్నారు. -
ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అవార్డులు గౌరవం ఇస్తాయి: మురళీమోహన్
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి. ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం. అంతేకానీ డబ్బుల గురించి కాదు... అవార్డు లనేవి గౌరవం ఇస్తాయి’’ అని నటుడు, నిర్మాత మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Telangana Film Awards) (2014–2023)కి సంబంధించి జ్యూరీ చైర్మన్‌గా మురళీమోహన్ వ్యవహరించారు. జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.ఈ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని ఎఫ్డీసీ కార్యాలయంలో మురళీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఈ పదేళ్లల్లో ముఖ్యమంత్రులందర్నీ కలిసి విన్నవించాం. అప్పుడు అందరూ ఇద్దాం, చేద్దాం అన్నారు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగారు ఓ స్ఫూర్తితో ప్రజాగాయకుడు గద్దర్‌గారి పేరిట ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ని ప్రకటించడం సంతోషం. ఈ కమిటీకి ‘దిల్’ రాజుగారు నన్ను చైర్మన్‌ని చేశారు.మా జ్యూరీలో అందరూ అనుభవం ఉన్నవారిని, సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారు. అందరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతోనే అవార్డులు ఎంపిక చేశాం. గురువారం సాయంత్రం ఈ అవార్డుల జాబితాను రేవంత్ రెడ్డిగారికి సమర్పించాం. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ అవార్డుల ప్రదానానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డిగారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి అవార్డుల ప్రదానం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని, ఒక అవగాహనకు రావాలి. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుంది. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు’’ అని పేర్కొన్నారు.తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు అవార్డుల చొప్పున (తొలి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం) ఈ పదేళ్లకు సంబంధించిన సినిమాలను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్‌గారి ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. అలాగే ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డుల్లో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డు (రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు) లతోపాటు అదనంగా తెలంగాణకి చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనున్నాం. జూన్ 14న 2024కి సంబంధించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’తోపాటు ఈ పదేళ్లకి సంబంధించిన అవార్డులను కలుపుకుని మొత్తం 11 ఏళ్లకి సంబంధించి అదే రోజు ప్రదానం చేస్తాం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు కె. దశరథ్, డీవీకే రాజు, ఊహ, ఉమామహేశ్వర రావు, వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డా. హరీశ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డుకి ఎంపికైన చిత్రాలు2014 1. రన్ రాజా రన్ 2.పాఠశాల 3. అల్లుడు శీను 2015 1. రుద్రమదేవి 2. కంచె 3. శ్రీమంతుడు 2016 1. శతమానం భవతి 2. పెళ్ళి చూపులు 3. జనతా గ్యారేజ్ 2017 1. బాహుబలి 2, 2. ఫిదా 3. ఘాజీ 2018 1. మహానటి 2. రంగస్థలం 3. కేరాఫ్ కంచరపాలెం 2019 1. మహర్షి 2. జెర్సీ 3. మల్లేశం 2020 1. అల వైకుంఠపురములో.. 2. కలర్ ఫోటో 3. మిడిల్ క్లాస్ మెలోడీస్ 2021 1. ఆర్ఆర్ఆర్ 2. అఖండ 3. ఉప్పెన 2022 1. సీతారామం 2. కార్తికేయ 2 3. మేజర్ 2023 1. బలగం 2. హనుమాన్ 3. భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డు: ప్రజాకవి కాళోజీ ప్రత్యేక అవార్డులు... ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ (హీరో) పైడి జైరాజ్ ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు: మణిరత్నం (డైరెక్టర్) బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్ (డైరెక్టర్) నాగిరెడ్డి–చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు (నిర్మాత) కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ (హీరో) రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత)⇒ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు... ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు... నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు... కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. – హీరో బాలకృష్ణ⇒ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘శ్రీమంతుడు, మహర్షి, మేజర్’ సినిమాలకు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా దర్శకులకు, ఈ అవార్డులకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను సెలబ్రేట్ చేసే ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలను ఇన్షియేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.– హీరో మహేశ్‌బాబు ⇒ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు నేను ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. అదే విధంగా 2016కి సంబంధించి రెండో ఉత్తమ సినిమాగా ‘పెళ్ళి చూపులు’ ఎంపికవడంపై సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకు చెందుతుంది. ఎందుకంటే వారి ప్రేమ, అభిమానాలే నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగమైన నా దర్శక–నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఇతర చిత్రయూనిట్‌కి థ్యాంక్స్. – హీరో విజయ్ దేవరకొండ⇒ 2015వ సంవత్సరానికిగాను మా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఆనందంగా,ప్రోత్సాహకరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారికి, మిగతా సభ్యులకు కృతజ్ఞతలు. రుద్రమ దేవిగా అనుష్క అద్భుతంగా నటించారు. గోన గన్నారెడ్డిపాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తెర ముందు, తెర వెనక మా చిత్రానికి వెన్నెముకగా నిలిచారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – దర్శక–నిర్మాత గుణశేఖర్⇒ తెలుగు సినిమా మార్గదర్శకులలో బీఎన్ రెడ్డిగారు ఒకరు. ఆయన పేరు మీద అవార్డు అందుకోనుండటం చాలా గౌరవం. నన్నెంతగానో స΄ోర్ట్ చేస్తున్న నా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ జ్యూరీకి నా ధన్యవాదాలు. – దర్శకుడు సుకుమార్ -
2014-23 వరకు గద్దర్ సినీ అవార్డుల ప్రకటన
-
గద్దర్ అవార్డ్స్.. 2014 నుంచి 2023వరకు ఉత్తమ చిత్రాలు ఇవే
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. జూన్ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు2014- ఉత్తమ చిత్రాలుఉత్తమ చిత్రం- రన్ రాజా రన్ఉత్తమ రెండో చిత్రం - పాఠశాలఉత్తమ మూడో చిత్రం - అల్లుడు శ్రీను2015- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవిరెండవ ఉత్తమ చిత్రం - కంచెమూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు2016- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతిరెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులుమూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్2017- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి: ది కన్క్లూజన్రెండవ ఉత్తమ చిత్రం - ఫిదామూడవ ఉత్తమ చిత్రం - ఘాజీ2018- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహానటిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - రంగస్థలంమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - C/O కంచరపాలెం2019- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహర్షిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - జెర్సీమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - మల్లేశం2020- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - అలా వైకుంఠపురములోరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటోమూడవ ఉత్తమఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్2021- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - RRRరెండవ ఉత్తమ చిత్రం - అఖండమూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన2022- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - సీతా రామంరెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2మూడవ ఉత్తమ చిత్రం - మేజర్2023- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బలగంరెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి2024- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం : కల్కీ 2898రెండవ ఉత్తమ చిత్రం : పోటేల్మూడవ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్స్పెషల్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణఎన్టీఆర్ నేషనల్ అవార్డు- నందమూరి బాలకృష్ణపైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నంబి ఎన్ రెడ్డి అవార్డు - దర్శకుడు సుకుమార్నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అట్లూరి పూర్ణచంద్రరావుకాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండరఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్ -
2024 'గద్దర్ అవార్డ్స్'తో ట్రెండ్ అవుతున్న తెలుగమ్మాయి (ఫోటోలు)
-
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.. ఆనందంలో విజేతలు
‘‘రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డు ఎవరికైనా ప్రత్యేక ఆనందాన్నిస్తుంది’’ అంటూ చిత్రరంగానికి చెందిన పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ‘‘సృజనాత్మక రంగంలో ఉన్న ఏ ఆర్టిస్ట్‌కైనా, టెక్నీషియన్‌కి అయినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఎంతో విలువైనది. అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం ప్రోత్సాహకరంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి‡రేవంత్ రెడ్డిగారు, సంబంధిత అధికారులు, ఇతర బృందానికి కృతజ్ఞతలు’’ అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక 2024 సంవత్సరానికిగాను అవార్డు విజేతల స్పందన ఈ విధంగా...తొలిసారిగా ప్రవేశ పెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘పుష్ప: ది రూల్’ సినిమాకు గాను తొలి ఉత్తమ నటుడిగా నాకు అవార్డు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు క్రెడిట్ అంతా నా దర్శకుడు సుకుమార్‌గారు, నా నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్) అండ్ ‘పుష్ప’ టీమ్‌కే చెందుతుంది. నన్ను ఎల్లప్పుడూ స΄ోర్ట్ చేస్తూ, నాలో స్ఫూర్తి నింపుతున్న నా అభిమానులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను.– హీరో అల్లు అర్జున్–‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో మాకు నాలుగు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు రావడం గర్వంగా ఉంది. ఇది మాకెంతో ప్రత్యేకం. తెలంగాణ ప్రభుత్వానికి, సీయం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు, జ్యూరీకి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రబృందం పేర్కొంది.–నాగ్ అశ్విన్ – నా జీవితంలో ఎప్పుడూ కష్టపడని రీతిలో ‘పొట్టేల్’ సినిమా కోసం కష్టపడ్డాను. చదువు గురించి చెప్పిన కథను ప్రభుత్వం గుర్తించడం హ్యాపీగా ఉంది. ‘కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్’ సినిమాల మధ్యలో మా సినిమాకూ చాన్స్ కల్పించారు. వెయ్యి కోట్ల (కలెక్షన్స్), వంద కోట్ల రూ పాయల సినిమాల మధ్య మా సినిమా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. మా నిజాయితీకి ప్రతిఫలం ఈ రూపంలో వచ్చిందనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, మా సినిమాను గుర్తించిన జ్యూరీకి థ్యాంక్స్. – ‘పొట్టేల్’ దర్శకుడు సాహిత్ మోత్కూరి– తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ఏడాది నుంచి అవార్డ్స్‌ను ప్రకటించడం నిజంగా సంతోషంగా ఉంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ‘దేవర’ సినిమాకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా విజేతగా నిలిచిన గణేశ్ ఆచార్యగారికి కంగ్రాట్స్. – హీరో ఎన్టీఆర్–14 ఏళ్ల తర్వాత మళ్లీ స్టేట్ అవార్డ్స్ రావడం, గద్దర్ అవార్డ్స్ తొలి ఎడిషన్‌లో నా పేరు ఉండటం, నా దర్శకత్వంలోని ‘లక్కీ భాస్కర్’ సినిమాకు నాలుగు అవార్డులు రావడం హ్యాపీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కరెక్ట్‌గా కుదిరింది. ఇందుకు హెల్ప్ చేసిన మా ఎడిటర్ నవీన్ నూలికీ అవార్డు వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణప్పుడే దుల్కర్ సల్మాన్ చాలా మంచి గుర్తింపు వస్తుందన్నారు. నిర్మాత నాగవంశీగారితో ‘లక్కీ భాస్కర్’ నా మూడో సినిమా. ఈ సినిమాకు గద్దర్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎంటర్టైన్మెంట్ అవార్డులను తిరిగి తీసుకొచ్చిన తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగార్లకు, జ్యూరీకీ «థ్యాంక్స్.– ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి –మాలాంటి న్యూ టాలెంట్‌ని ప్రోత్సహించేలా అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా టీమ్ సహకారం లేక΄ోతే ఇలాంటి అవార్డులు కష్టం. ఈ సినిమాని నిర్మించిన మా నిర్మాతలు నిహారిక, ఫణిగార్ల ప్రొడక్షన్ హౌస్‌లకి ఈ అవార్డు ఓ బూస్ట్‌లాంటిది. ఈ అవార్డు కొత్తవాళ్లతో సినిమాలు తీయొచ్చనే అభి్ర పాయాన్ని వారికి బలపరుస్తుంది. మా ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన హీరోలు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా డీఓపీగారు సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమా విడుదల కాగానే పెద్ద్ద బేనర్స్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి. – ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీ–హైదరాబాద్‌లో జరిగిన మారణహోమాన్ని భారతీయుల కళ్ల ముందుకు తీసుకువచ్చేందుకు నిజాయతీగా మేం పెట్టిన కష్టానికి ‘రజాకార్’ సినిమాకిగాను అవార్డ్స్ వచ్చాయనిపిస్తోంది. 1947, 1948 సమయంలో హైదరాబాద్ స్టేట్ కింగ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో హిందువులపై రజాకార్లు జరిపిన దురాగతాలను నేటి తరం ప్రేక్షకుల ముందుకు ‘రజాకార్’ సినిమా రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో మేం సక్సెస్ అయ్యాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నందుకు తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు. – బీజేపీ సీనియర్ నేత, ‘రజాకార్’ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి –మా ‘రజాకార్’కి మూడు అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉంది. మేం ఎంత నిజాయతీగా ఆలోచించి ఈ సినిమా చేశామో జ్యూరీ కూడా అంతే నిజాయతీగా మా సినిమాని ఎంపిక చేయడం సంతోషం. దాదాపు ఇరవయ్యేళ్లుగా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్న భీమ్స్ సిసిరోలియోకి మా సినిమా ద్వారా అవార్డు రావడం మాకు, తనకు సంతోషంగా ఉంది. ఇరవయ్యేళ్లుగా ఉన్న మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీనుకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారు కూడా చాలా ఆనందంతో ఫోన్ చేసి, మాట్లాడారు. – ‘రజాకార్’ దర్శకుడు యాటా సత్యనారాయణ–‘మ్యూజిక్షాప్ మూర్తి’ సినిమాకి నాకు అవార్డు రావడానికి మా టీమ్ సహకారం ఉంది. నిర్మాతలు హర్ష గార పాటి, రంగారావు, సహ–నిర్మాతలు సత్యకుమార్, వంశీ ప్రసాద్, సత్యనారాయణ పాలడుగు మమ్మల్ని నమ్మి, అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చిన్న సినిమా అని కాకుండా కథ, కథనం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, దర్శకుడి విజన్... ఇవే జ్యూరీ చూసిందని నేను అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అవార్డులను తిరిగి తీసుకొచ్చిన ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్, జ్యూరీకి ధన్యవాదాలు. – ‘మ్యూజిక్షాప్ మూర్తి’ దర్శకుడు శివ పాలడుగు–కొత్తవారికి ప్రభుత్వ అవార్డులు ఓ మంచి బూస్ట్లాంటివి. తెలంగాణ ప్రభుత్వానికి «థ్యాంక్స్. ‘క’ రిస్కీ లైన్‌తో చేసిన సినిమా. స్క్రీన్‌ప్లేని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా ట్రావెల్ అవుతారు? అనుకునేవాళ్లం. కానీ సబ్జెక్ట్‌ని బలంగా నమ్మాం. క్లైమాక్స్‌లో మేం చెప్పిన విషయానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయితే హిట్ అనుకున్నాం. మేం అనుకున్నట్లే కనెక్ట్ అయ్యారు. ఇక... మేం కొత్త కథలు అనుకోవడానికి చిన్నప్పట్నుంచి మా అమ్మ చెప్పిన కథలు హెల్ప్ అయ్యాయి. మా నాన్నగారి ఎంకరేజ్మెంట్ని మరచి΄ోలేం. అయితే మా సక్సెస్‌ని చూడకుండానే నాన్నగారు గత ఏడాది దూరం అయ్యారు. ఆ వెలితి ఉంది. – ‘క’ చిత్రదర్శకులు సుజీత్–సందీప్–పధ్నాలుగేళ్ల తర్వాత ఇస్తున్న అవార్డ్స్‌లో నా తొలి సినిమాకు అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. గీతా ఆర్ట్స్ వంటి నిర్మాణ సంస్థ అండగా ఉండటంతో ఈ సినిమా జర్నీ సాఫీగా సాగింది. అయితే మా సినిమా రిలీజ్ టైమ్‌లో మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. దాంతో మా సినిమా రిజల్ట్ విషయంలో ఆందోళన చెందాను. అయితే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఆయ్’కు అవార్డు వచ్చిందనగానే హీరో నార్నే నితిన్, నిర్మాత బన్నీ వాసుగారు, ఇంకా మా టీమ్ అంతా ఆ షూట్ డేస్‌ని గుర్తు చేసుకున్నాం. – ‘ఆయ్’ దర్శకుడు అంజి కె. మణిపుత్ర -
ఉత్తమ నటుడు అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమాలో నటనకుగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) గెలుచుకున్నారు. ప్రజా వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు గద్దర్ పేరుపై ఏర్పాటుచేసిన సినిమా అవార్డులను తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలసి గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్, నటి జయసుధ గురువారం అవార్డుల వివరాలను ప్రకటించారు. మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి 2898ఏడీ, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డులు గెలుచుకున్నాయి. మొత్తం 11 కేటగిరీల్లో 1,248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా అవార్డులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 14వ తేదీన విజేతలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రెండు చిత్రాలకు నాలుగేసి అవార్డులు గద్దర్ అవార్డుల్లో కల్కి 2898ఏడీ, లక్కీ భాస్కర్ సినిమాలు నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్కీన్ర్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్, స్పెషల్జ్యూరీ అవార్డులు లక్కీ భాస్కర్ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తం ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ కాసూ్టమ్ డిజైనర్ కేటగిరీల్లో కల్కి అవార్డులు గెలుచుకుంది. రజాకార్ సినిమా చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. అన్ని కేటగిరీల్లోనూ 2024కు సంబంధించి గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వబోతోందని దిల్ రాజు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఎంపిక జరిగిందని చెప్పారు. పారదర్శకంగా స్క్రీనింగ్ చేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్‌ను ఎంపిక చేసినట్లు జయసుధ వివరించారు. 2014, జూన్ నుంచి 2023, డిసెంబర్ వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలకు త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాల విభాగంలో అవార్డులు మొదటి ఉత్తమ మొదటి చిత్రం: కల్కి రేండో ఉత్తమ చిత్రం: పొట్టేల్ ఉత్తమ మూడవ చిత్రం: లక్కీ భాస్కర్ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: కమిటీ కుర్రోళ్లు ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: యదువంశీ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఆయ్ చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం: రజాకార్ వ్యక్తిగత విభాగంలో అవార్డులు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2) ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి) ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన–నిజమే నే చెబుతున్నా..) ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2– సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తు వదలరా–2) ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్) ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్) ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్) ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి) ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్) ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర) ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్) ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) స్పెషల్ జ్యూరీ అవార్డులు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) అన్యన్య నాగళ్ల (పొట్టేల్) సుజిత్, సందీప్ (కేఏ) ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ (రాజు యాదవ్) స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్దా (మత్తు వదలరా–2) తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్) -
గద్దర్ అవార్డ్స్ ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. 2024 ఏడాదిగానూ ఎంపికైన అవార్డ్ గ్రహీతలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. సృజనాత్మక రంగంలోని ఏ కళాకారుడికైనా, సాంకేతిక సిబ్బందికైనా రాష్ట్ర గుర్తింపు అనేది చాలా విలువైనదని అన్నారు. ఇలాంటి అవార్డులు మరింత ప్రేరణనిస్తాయని రాసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించడం సినీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అవార్డులు విషయంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా.. ఇవాళ జయసుధ నేతృత్వంలోనే జ్యూరీ గద్దర్ అవార్డులు-2024 విజేతలను ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు.ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. Hearty Congratulations to each and every winner of the First #GaddarTelanganaFilmAwards for the year 2024. 👏👏State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity. It’s greatly encouraging to see the Government of…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025 -
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డ్స్‌లో ఆహా ఓటీటీ సినిమాలు తమ సత్తా చాటాయి. పలు కీలక విభాగాల్లో ఆహా చిత్రాలు అవార్డులు సాధించాయి. 'పొట్టేల్' సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా, '35 ఇది చిన్న కథ కాదు' బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్‌గా అవార్డులు గెలుచుకున్నాయి. '35 ఇది చిన్న కథ కాదు' చిత్రంలో నటనకు నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్గా, 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'లో నటనకు శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా, 'రజాకార్' చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డులు అందుకున్నారు.'35 ఇది చిన్న కథ కాదు'లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, 'మెర్సీ కిల్లింగ్'లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. 'రాజు యాదవ్' చిత్రానికి చంద్రబోస్ బెస్ట్ లిరిసిస్ట్‌గా, 'రజాకార్'కు నల్ల శ్రీను బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా అవార్డులు పొందారు. 'పొట్టేల్'లో నటనకు అనన్య నాగళ్ల, 'రాజు యాదవ్' నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డులు సాధించారు.ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డులు గెలవడంపై ఆహా టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్‌లు, షోలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కంటెంట్ అందించడమే తమ లక్ష్యమని ఆహా టీమ్ పేర్కొంది. -
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు : అల్లు అర్జున్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేయడం గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు పుష్ప టీమ్ మొత్తానికి ఈ ఘనత దక్కుతుందని చెప్పారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. (చదవండి: గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?)అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డులపై స్పందించారు. సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు గెలుచుకున్న గణేష్‌తో పాటు విజేతలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. (చదవండి: :'గద్దర్ అవార్డ్స్' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం)కాగా, 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప 2), ఉత్తమ నటిగా నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు) అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 14న ఈ అవార్డులను అందిస్తారు. -
తెలంగాణ గద్దర్ అవార్డులు.. ఉత్తమ సినీ గ్రంథంగా రెంటాల జయదేవ పుస్తకం
రచయిత, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలపై ఆయన రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు అవార్డ్ లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది.దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ మన సినిమా... ఫస్ట్ రీల్ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి.. భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన గ్రంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ల క్రితం అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింది.తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం కాళిదాస్(1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ.. మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ల నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమని తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్లం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామని గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ల తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన మొట్టమొదటి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఈ పుస్తకం పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది.ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుంచి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి మన సినిమా... ఫస్ట్ రీల్ అనే పుస్తకంలో పొందుపరిచారు. పైపైన వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్లకు కట్టినట్లు వివరించారు.తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి.తొలి పూర్తి నిడివి పది రీళ్ల తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన చెప్పిన ఫిబ్రవరి 6నే అధికారికంగా తెలుగు సినిమా డేను జరుపుకొంటూ ఉండడం విశేషం.ఇది చదవండి: తెలుగు సినిమా పండగ రోజురెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ల తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ (Rentala Jayadeva) నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం గుర్తించింది. భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని పురస్కరించుకొని ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం. -
#GaddarAwards2024 : గద్దర్ అవార్డులు-2024 (ఫొటోలు)
-
గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఈ చిత్రాలకు గాను జూన్ 14న అవార్డులు అందిస్తారు. ఉత్తమ చిత్రాలుగా అవార్డులు గెలుచుకున్న చిత్రాల నేపథ్యంపై ఓ లుక్కేద్దాం. ఫలించిన నాగ్ అశ్విన్ ప్రయోగంవెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి ప్రయోగాత్మక చిత్రమే కల్కి 2898 ఏడీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని కల్కి చిత్రం ద్వారా సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది.మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది ఫైటర్ భైరవ (ప్రభాస్)కోరిక.మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.సందేశం ఇచ్చిన పొట్టేల్ పొట్టేల్..పేరుకు చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశారు. 1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది.పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.భాస్కర్ లక్కీనే..1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే లక్కీ భాస్కర్. బ్యాంక్‌లో పని చేసే ఒక కామన్ స్టాక్ ఎక్సేంజ్‌ని ఎలా బురిడీ కొట్టించారనేది ఈ సినిమా కథ. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, మధ్య తరగతికి చెందినవారి మనస్తత్వాలు... వీటన్నిటినీ మేళవిస్తూ ఓ వ్యక్తి జీవిత ప్రయాణంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడ వెంకీ అట్లూరి. కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
గద్దర్ అవార్డ్స్ ప్రకటన
-
'గద్దర్ అవార్డ్స్' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్'
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్ నటి జయసుధ (Jayasudha), ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీమ్, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం : పోటేల్‌ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్‌ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్‌హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రం- రజాకార్ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్ (రజాకార్)ఉత్తమ సహాయ నటుడు : ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్రశేఖర్ (గ్యాంగ్‌స్టర్ )ఉత్తమ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్‌రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విజేతలు దుల్కర్ సల్మాన్: లక్కీ భాస్కర్‌అనన్య నాగళ్ల: పొట్టేల్‌దర్శకులు సూజిత్, సందీప్ (క) నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ (రాజూ యాదవ్)స్పెషల్ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2) -
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ వేడక ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి (Gaddar Film Awards) వేదిక ఖరారు అయింది. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు (Dil Raju) ఏర్పాట్లకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధ (Jayasudha)తో పాటుగా 15మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్‌రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు. జూన్ 14న హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉంటుందని వారు ప్రకటించారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం గురించి ఇలా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమకు చెందిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సహకాలతో పాటు అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇలా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి భావించారని భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమని ఆయన అన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయంగా భావించామన్నారు. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల జాబితాను జ్యూరీ ఛైర్మన్ జయసుధకు భట్టివిక్రమార్క, దిల్‌రాజు అందించారు. ఎంపిక అయిన 35 చిత్రాలను జ్యూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం వీక్షించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల భట్టి విక్రమార్క శ్రద్దాంజలి ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం వల్ల నేడు విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణను వాయిదా వేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ జరిపిస్తామని వారు తెలిపారు. -
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ అవార్డుల ఎంపికకు సంబంధించి జ్యూరీని ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ కమిటీని ప్రకటించారు. ఈ జ్యూరీకి ఛైర్మన్ టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ అవార్డులక వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు.ఈ జ్యూరీ ఉన్న సభ్యుల పేర్లను తాజాగా విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ కూడా మెంబర్‌గా ఎంపికయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్,ఉమామహేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, వీఎన్ ఆదిత్య కూడా ఉన్నారు. ఎగ్జిబిటర్ విజయ్ కుమార్ రావు, ఫిల్మ్ అనలిస్ట్ ఆకునూరు గౌతమ్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, జర్నలిస్టులు లక్ష్మీ నారాయణ, వెంకటరమణ కూడా సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. టీజీఎఫ్డీసీ ఎండీ మెంబర్, కన్వీనర్‌గా ఉండనున్నారు. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాల విభాగాల్లో 76 నామినేషన్లు వచ్చాయి. ఓవరాల్‌గా గద్దర్ అవార్డులకు 1248 నామినేషన్లు అందాయి. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. -
గద్దర్ అవార్డులు.. జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా సినీ నటి జయసుధను నియమించారు. దాదాపు 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర విభాగాల్లో 76 నామినేషన్స్ వచ్చాయి. వ్యక్తిగత కేటగిరిలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ అవార్డులకు 1248 నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను అందజేయనుంది. -
ఏప్రిల్‌లో గ్రాండ్‌గా ‘గద్దర్’ అవార్డులు.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ఏప్రిల్‌లో ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్ అవార్డు( Gaddar Awards)ను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత 2014 నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు 2023 వరకు ఇవ్వనున్నాం.నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారం రోజుల్లో అవార్డులను జ్యూరీ ఫైనల్ చేస్తుంది. గద్దర్ అవార్డు నమునా కూడా సిద్ధం అవుతోంది. ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తాం. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దని కోరుతున్నాను. గతంలో సింహా అవార్డుల కోసం అమౌంట్ పే చేసిన వారికి ఎఫ్డీసీ నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో కూడా గౌరవ అవార్డులు ఇస్తాం’ అని దిల్ రాజు చెప్పారు.