ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే | Gaddar Awards 2025 Ceremony Live Updates | Sakshi
Sakshi News home page

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్.. ఎవరికి ఏ విభాగంలో అంటే?

Jun 14 2025 9:15 PM | Updated on Jun 14 2025 10:21 PM

Gaddar Awards 2025 Ceremony Live Updates

హైదరాబాద్‌లోని అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. 2014 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలు, నటీనటులకుగానూ ఈ పురస్కారాల ప‍్రదానం చేశారు. అవార్డ్‌తో పాటు సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.

అవార్డులు అందుకున్న విజేతలు వీళ్లే

  • ఉత్తమ నటుడు- అల్లు అర్జున్‌( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)
  • ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌
  • ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీ
  • ద్వితీయ ఉత్తమ చిత్రం : పొట్టేల్‌
  • తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌
  • ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్‌: మేం ఫ్రెండ్సండీ
  • ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
  • ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్‌ శ్రీరామ్‌: ఊరుపేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)
  • ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్‌: పుష్ప2 (సూసేటి అగ్గిరవ్వ) 
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేష్‌ ఆచార్య (దేవర-ఆయుధపూజ)
  • ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)
  • ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్‌ (మత్తు వదలరా2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)
  • ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అధ్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌కుమార్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)
  • ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)
  • ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)
  • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: అరుణ్‌ దేవ్‌ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్‌)
  • ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కమ్యూనల్‌ హార్మోనీ సోషల్‌ అప్లిస్ట్‌: కమిటీ కుర్రాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement