తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు : అల్లు అర్జున్‌ | Allu Arjun Response On Gaddar Awards 2024 | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు : అల్లు అర్జున్‌

May 29 2025 3:53 PM | Updated on May 29 2025 5:45 PM

Allu Arjun Response On Gaddar Awards 2024

గద్దర్‌ అవార్డ్స్‌పై స్పందించిన అల్లు అర్జున్‌

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులపై అల్లు అర్జున్‌ స్పందించారు. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేయడం గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సుకుమార్‌, నిర్మాతలతో పాటు పుష్ప టీమ్‌ మొత్తానికి ఈ ఘనత దక్కుతుందని చెప్పారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్‌ ప్రకటించారు. 

(చదవండి: గద్దర్‌ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?)

అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా గద్దర్‌ అవార్డులపై స్పందించారు.  సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు గెలుచుకున్న  గణేష్‌తో పాటు విజేతలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

(చదవండి: :'గద్దర్‌ అవార్డ్స్‌' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం)

కాగా, 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ వెల్లడించారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్‌, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్‌ ఎంపికైంది.  ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌(పుష్ప 2), ఉత్తమ నటిగా నివేధా థామస్‌ ( 35 చిన్న కథ కాదు) అవార్డుకు ఎంపికయ్యారు. జూన్‌ 14న ఈ అవార్డులను అందిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement