'గద్దర్‌ అవార్డ్స్‌' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్‌' | Telangana Government Announced Gaddar Awards 2024, Check Out Full List Of Winners Inside | Sakshi
Sakshi News home page

Gaddar Awards 2024: 'గద్దర్‌ అవార్డ్స్‌' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

May 29 2025 10:31 AM | Updated on May 29 2025 3:40 PM

Telangana Government Issues Gaddar Awards

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards)  ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.  గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ నటి జయసుధ (Jayasudha), ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్‌ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్‌ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను  ఇస్తున్నట్టు దిల్‌ రాజు గుర్తుచేశారు.  

చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్‌ టీమ్‌, ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో  76 దరఖాస్తులు వచ్చాయి. 

2024 విజేతలు

  •  ఉత్తమ చిత్రం : కల్కీ 2898
  • ఉత్తమ రెండో  చిత్రం ‌: పోటేల్‌
  • ఉత్తమ మూడో  చిత్రం: లక్కీ భాస్కర్‌
  • ఉత్తమ బాలల చిత్రం  : 35- చిన్న కథకాదు
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్‌
  • హిస్టరీ  ఫీచర్‌ విభాగంలో ఉత్తమ హెరిటేజ్‌ చిత్రం- రజాకార్‌
     
  • ఉత్తమ నటుడు‌: అల్లు అర్జున్‌ (పుష్ప 2)
  • ఉత్తమ నటి: నివేధా థామస్‌ ( 35 చిన్న కథ కాదు)
  • ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్‌ (కల్కి 2898 ఏ.డీ)
  • ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
  • ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్‌ (రజాకార్‌)
  • ఉత్తమ సహాయ నటుడు : ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
  • ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)
  • ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ : చంద్రశేఖర్‌ (గ్యాంగ్‌స్టర్‌ )
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : గణేష్‌ ఆచార్య (దేవర)
  • ఉత్తమ కమెడియన్‌: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)
  • ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : సిద్‌ శ్రీరామ్‌ (ఊరుపేరు భైరవకోన)
  • ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఫిమేల్‌: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)
  • ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)
  • ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- విశ్వనాథ్‌రెడ్డి (గామి)
  • ఉత్తమ బాలనటులు- మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)
  • ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)
  • ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి)
  •  బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)


    స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ విజేతలు
     
  • దుల్కర్‌ సల్మాన్‌: లక్కీ భాస్కర్‌
  • అనన్య నాగళ్ల:  పొట్టేల్‌
  • దర్శకులు సూజిత్‌, సందీప్‌ (క)  
  • నిర్మాతలు ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ (రాజూ యాదవ్‌)
  • స్పెషల్‌ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

     




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement