సెలబ్రిటీ అన్నాక అంతో ఇంతో లగ్జరీ లైఫ్ ఉంటుంది. కొందరు స్టార్స్ అయితే తమ జీవితాన్ని ఆడంబరంగా గడుపుతుంటారు. మరికొందరేమో చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు మన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. ఆయన చాలా సాధారణ లైఫ్ స్టైల్ పాటిస్తుంటారు. తాజాగా చాలా సింపుల్‌గా హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాత బైక్‌పై సందడి చేశారు. లగ్జరీ కార్లకు బదులుగా ఇప్పటికీ తన తండ్రి వాడిన హీరో బైక్‌పైనే నగరంలో కనిపించారు. ఈ బైక్‌పై అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తండ్రి బైక్‌ను ఉపయోగించడం, నిరాడంబరంగా జీవించడమే తనకు ఇష్టమని చెబుతూ తన సింప్లిసిటీని చాటుకున్నాడు మన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన శర్వానంద్ భోగి మూవీకి సంగీతమందిస్తున్నారు.
భీమ్స్ బైక్‌రైడ్ ఇన్ అన్నపూర్ణ స్టూడియో.. టాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా సింపుల్‌గా బైక్‌పై అన్నపూర్ణ స్టూడియోకు వచ్చాడు.. #Bheems #Bheemsceciroleo https://t.co/iWDPRXW8PU
— Maduri Madhu (@madurimadhu1) November 4, 2026


