‘రామాయణ’లో సర్‌ప్రైజ్‌ చేసిన ‘ది ప్యారడైజ్‌’ విలన్‌ | The Paradise Villain Raghav Juyal In Ramayana | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రామాయణలో సర్‌ప్రైజ్‌ చేసిన ‘ది ప్యారడైజ్‌’ విలన్‌

Nov 5 2026 8:21 PM | Updated on Nov 5 2026 8:33 PM

The Paradise Villain Raghav Juyal In Ramayana

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణ’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'రామాయణం' పార్ట్-1 గురువారం (అక్టోబర్ 5) ఎట్టకేలకు రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాపై ఎస్.ఎస్ రాజమౌళి వంటి పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ‘రామాయణ’ మూవీ రివ్యూ)

మేఘనాథుడుగా సర్‌ప్రైజ్‌..
మూవీ ఎండ్‌ టైటిల్స్‌లో రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్ (మేఘనాథుడు) పాత్రను పరిచయం చేశారు. ఇందులో కనిపించిన నటుడిని చూసి తెలుగు ఆడియన్స్ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు రాఘవ్‌ జుయల్‌ పోషించారు. ఈయన మొన్న రిలీజైన ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో విలన్‌గా నటిస్తూ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇప్పుడు 'రామాయణ'లో కనిపించడం చూసి ప్రేక్షకులు షాక్‌ అయ్యారు.

హనుమంతుడి పాత్రలో..
కాగా ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌, లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించారు. కానీ ఆయన లుక్ ని ఇప్పటివరకూ విడుదల చేయలేదు. ట్రైలర్ లో కూడా ఆయన్ని చూపించలేదు. అయితే పార్ట్-1లో ఆయన పాత్రను చూపించలేదు.

ఇదీ చదవండి: ‘రామాయణ’పై డైరెక్టర్‌ రాజమౌళి రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement