‘రామాయణం’ మూవీ రివ్యూ | Ramayana Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘రామాయణం’ మూవీ రివ్యూ

Nov 5 2026 12:41 PM | Updated on Nov 5 2026 1:34 PM

Ramayana Movie Review And Rating In Telugu

టైటిల్: రామాయణం పార్ట్‌  1
నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయి పల్లవి, సన్నీ డియోల్‌,  కాజల్‌,  శోభన, అరుణ్, రవి దూబే, లారా దత్తా తదితరులు
నిర్మాణ సంస్థ: ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్
నిర్మాత: నితేష్‌ తివారీ
దర్శకుడు: నితేష్ తివారీ
సంగీతం: జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్
విడుదల తేది: నవంబర్‌  5, 2026

ధర్మం అంటే ఏంటి? మాట విలువ ఏంటి? ఆశ మనిషిని ఎలా కృంగదీస్తుంది? స్వామి భక్తి అంటే ఏంటి? ఇలా.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఆది కావ్యం రామాయణం. ఈ కావ్యానికి ఇప్పటికే ఎంతో మంది దృశ్యరూపం ఇచ్చారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు, సరికొత్త హంగులతో భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం రామాయణ(తెలుగులో రామాయణం). రణ్‌బీర్‌, యశ్‌, సాయి పల్లవి లాంటి పాన్‌ ఇండియా స్టార్స్‌  నటించడంతో మొదటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ ‘రామాయణం’ అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
రామాయణం..అందరికీ తెలిసిన కథే. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. దర్శకుడు నితేష్‌ తివారీ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మొదటి భాగంలో రావణుడు ఘోర త‌పస్సు చేసి, బ్ర‌హ్మ నుంచి వ‌రం పొంద‌డం ద‌గ్గ‌ర్నుంచి కథను ప్రారంభించాడు. అతను లంకను స్వాధీనం చేసుకోని ముల్లోకాలకు అధిపతి గా మారడం..  ఆ తర్వాత రాముడి జననం.. యోధుడిగా మారడం..సీతా పరిణయం.. వనవాసం.. శూర్ప‌ణ‌క ప‌రాభ‌వం, మాయా లేడిని పంపి, సీత‌ని రావ‌ణుడు ఎత్తుకు రావ‌డం వరకు పార్ట్‌ 1లో చూపించాడు. ఇక రావణుడితో రాముడి యుద్ధం పార్ట్‌ 2లో ఉండబోతుంది.

ఎలా ఉందంటే.. 
ఇది అందరికీ తెలిసిన కథే. దాన్ని తెరపై ఎలా చూపించారనేది ముఖ్యం. విజువల్స్‌ పరంగా మ్యాజిక్‌ చేయాలి. నేటి తరాన్ని సైతం ఆకట్టుకునేలా  తీర్చిదిద్దాలి. ఈ విషయం దర్శకుడి నితీష్‌ తివారీకి బాగా తెలుసు. అందుకే తెలిసిన, జన బాహుళ్యంలో ప్రచారం ఉన్న రామాయణ కథనే ఎంచుకొని..దానికి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. అదే సమయంలో ఎమోషన్స్‌ కూడా మిస్‌ కానివ్వలేదు. కానీ ప్రతి విషయం డీటెయిల్డ్‌ చూపించడంతో నిడివి పెరిగి(దాదాపు మూడు గంటలు) ల్యాగ్‌  ఫీలింగ్‌  రావొచ్చు. కొన్ని చోట్ల సీరియల్స్‌ లా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విజులవ్స్‌ పరంగా మాత్రం ఈ సినిమా నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పొచ్చు. రావణుడితో జాటాయువు పోరాటం చేసే సీన్‌  ఈ సినిమాకే హైలెట్‌. అలాగే సీతను అపహరించి పుష్పక విమానంతో తీసుకెళ్లడం, రాక్షసులతో రాముడు యుద్ధం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రారంభంలో అసుర గ‌ణం – దేవ‌గ‌ణం యుద్ధం సీన్లు కూడా అదిరిపోతాయి. 

దేవేంద్రుడు యుద్ధం చేసి అసురులను ఓడించే సీన్‌  కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రావణుడు తపస్సు చేసి వరం పొందడం.. కుభేరుడిపై యుద్దం చేసి లంకను కైవసం చేసుకునే వరకు  ఓ యాక్షన్‌ సినిమా మాదిరి కథనం సాగుతుంది. రాముడి ఎంట్రీ  బాగా డిజైన్‌ చేశారు. తాటకి, సుబాహు రాక్షసులతో రాముడు చేసే యుద్దం సీన్లు హాలీవుడ్‌ సినిమాలను గుర్తు చేస్తాయి.  రాముడి అరణ్యవాసంతో ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది. ఇక సెకండాఫ్‌లో శూర్ప‌ణ‌క ప‌రాభ‌వం, సీతాపహరణం ఉంటుంది.  ఈ సీన్లను బాగా డిజైన్‌ చేశారు.  

అలాగే రావణుడిని పది తలలో చూపించలేదు కానీ.. ఒక సీన్‌లో అతని పది తలలు ఎలా ఆలోచిస్తాయో చూపించారు. సీతను రావణుడు ఎత్తుకెళ్లాడనే విషయాన్ని జటాయువు.. రాముడితో చెప్పడంతో పార్ట్‌ 1 ముగుస్తుంది.  చివరిలో హనుమంతుడి ఎంట్రీని చూపించారు. ఇక పార్ట్‌ 2లో రావణుడిపై రాముడి యుద్దం చూపిస్తారు. ఇది కూడా అందరికి తెలిసిందే. విజువల్స్‌ పరంగా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. 



ఎవరెలా చేశారంటే.. 
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాముడి పాత్రకు ర‌ణ‌బీర్ క‌పూర్ పూర్తి న్యాయం చేశాడు. అయితే తెలుగు డబ్బింగ్‌ అంతగా సెట్‌ కాలేదనిపిస్తుంది. ఇక రావణుడి పాత్రలో యష్‌  పరకాయ ప్రవేశం చేశాడు. పార్ట్‌ 1లో అతనికే ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఇచ్చారు. తొలి పావుగంట అతని చుట్టూనే తిరుగుతుంది. సీతగా సాయి పల్లవి పర్వాలేదు. నటన పరంగా ఆమె పెద్దగా మెప్పించిందేమి లేదు. శూర్పణకగా రకుల్‌  కూడా అంతే. ఇక రావణుడి సతీమణి మండోదరిగా కాజల్‌  రెండు సీన్లలో కనిపించి, ఒకే ఒక్క డైలాగుతో సరిపెట్టుకుంది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు.

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ అదిరిపోయింది. నేపథ్య సంగీతం బాగుంది. రెహమాన్‌ పాటలు ఆకట్టుకోలేదు. ఎడిటింగ్‌  పర్వాలేదు. రన్‌ టైమ్‌ తగ్గిస్తే బాగుండేది కానీ.. అక్కడ తగ్గించే స్కోప్‌ లేదు. రామాయణం లాంటి గొప్ప ఇతిహాసాన్ని ఇలానే చెప్పాలి. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement