మాయ లేడీ రెడీ  | Rakesh Varre Maya Lady Trailer Launch | Sakshi
Sakshi News home page

మాయ లేడీ రెడీ 

Nov 5 2026 4:30 AM | Updated on Nov 5 2026 4:30 AM

Rakesh Varre Maya Lady Trailer Launch

రాకేష్‌ వర్రే హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మాయ లేడి’. ప్రశంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మధుమిత సర్కార్‌ హీరోయిన్‌గా నటించారు. క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ ఈ నెల 13న రిలీజ్‌కి రెడీ అయింది. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రశంకర్‌ మాట్లాడుతూ– ‘‘తన గర్ల్‌ ఫ్రెండ్‌లోని డిఫరెంట్‌ ఎమోషన్స్‌ను క్రిష్‌ అనే అబ్బాయి ఎలా ఫేస్‌ చేశాడు? అనేది మా మూవీలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. 

మంచి మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చిన్న సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు. రాకేష్‌ వర్రె మాట్లాడుతూ– ‘‘పేకమేడలు, ఎవరికీ చెప్పొద్దు’ వంటి సినిమాల తర్వాత రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘మాయలేడి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్, మ్యూజిక్‌కు ప్రాధాన్యత ఉంటుంది. నేను ప్రొడ్యూసర్‌ అయితే ఈ కథను రాజీ పడకుండా చేయగలనని నిర్మించాను. ఈ సినిమా పెద్ద హిట్‌ అయితే మరో మంచి చిత్రం చేస్తాను’’ అన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement