సాక్షి,చెన్నై: 118 సవర్ల భారీ బంగారు ఆభరణాలు చోరీకి గురై ఇల్లు గుల్లయినా.. ఆ యూట్యూబర్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ మిలియన్లతో వ్యూస్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ విచిత్రమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన వినోద్‌కుమార్ భార్య మధుమిత ప్రముఖ యూట్యూబర్. వీరికి ఒక కుమార్తె ఉంది. మధుమిత సోషల్ మీడియాలో తన ఒళ్లంతా బంగారం వేసుకుని, చేతుల్లో కట్టలు కొద్దీ డబ్బులు చూపుతూ విలాసవంతమైన వీడియోలు పోస్ట్ చేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
మధుమిత తన భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి ఏకంగా 118 సవర్ల నగలు, నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే, మధుమిత ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వేలాది (6,669) రీల్స్ చూసే దుండగులు ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చోరీ తర్వాత కూడా ఆగని రీల్స్ క్రేజ్
అసలు ఇంట భారీ దొంగతనం జరిగితే ఎవరైనా షాక్‌లో ఉంటారు. కానీ మధుమిత మాత్రం చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే ఏకంగా 10 కొత్త వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. అందులో ఏకంగా తన తలపై డబ్బులు పోసుకుంటూ ఆమె డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు ఉండటం విశేషం.
ఈ వీడియోలు నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారాయి. కేవలం 40 గంటల్లోనే ఒక వీడియోకు 39 లక్షల వ్యూస్ రాగా.. మరో వీడియోకు 20 లక్షల వీక్షణలు దక్కాయి.మొత్తంగా ఆ 10 వీడియోలకు ఏకంగా 1.50 కోట్ల వ్యూస్ రావడం గమనార్హం. ఈ వివాదం పుణ్యమా అని ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు చేరింది. ఇల్లు దోపిడీకి గురైనా తగ్గేదేలే అంటూ రీల్స్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తున్న ఈ యూట్యూబర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది.
A Kanyakumari-based influencer was flaunting her wealth online displaying gold jewellery, cash, shopping sprees and an extravagant lifestyle. Then came a burglary- 118 gold sovereigns and cash were stolen from her home. Burglary is wrong, period. But is your sympathy with her? https://t.co/i02wlffqca
— Harsh Goenka (@hvgoenka) September 26, 2026


