భవిష్యత్తులో యుద్ధం ఇలా ఉంటుంది: కళ్లకు కట్టినట్లు చెప్పిన సీడీఎస్ | CDS NS Raja Subramani on Warfare To Prepare For Future Conflicts | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో యుద్ధం ఇలా ఉంటుంది: కళ్లకు కట్టినట్లు చెప్పిన సీడీఎస్

Sep 29 2026 5:37 PM | Updated on Sep 29 2026 5:58 PM

CDS NS Raja Subramani on Warfare To Prepare For Future Conflicts

న్యూఢిల్లీ: భవిష్యత్‌ యుద్ధాలకు సాయుధ దళాలు సాంకేతికంగా సిద్ధం కావాల్సిన అవసరాన్ని వివరించారు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి. ముఖ్యంగా బహుళ రంగాల సమన్వయ యుద్ధం, కృత్రిమ మేధ, డేటా ఆధారిత నిర్ణయాలు, నమ్మకమైన సమాచార వ్యవస్థలు కీలకమని చెప్పారు.  


తాజాగా ఓ కార్యక్రమంలో జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి మాట్లాడుతూ.. భవిష్యత్‌ యుద్ధంలో భూ, సముద్ర, గగన, అంతరిక్ష, సైబర్‌ తదితర రంగాలను విడివిడిగా కాకుండా ఒక సమగ్ర వ్యవస్థగా అనుసంధానించి పనిచేయాలి అన్నారు. శత్రువు స్పందించేలోపే వివిధ రంగాల నుంచి సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రభావం చూపడం కీలకమన్నారు. ఉపగ్రహాలు శత్రువును గుర్తిస్తే.. గగన, సముద్ర, భూ, ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలు ఆ సమాచారాన్ని దాదాపు తక్షణమే పంచుకోవాలని చెప్పారు.

శత్రువు సమాచార వ్యవస్థలను అడ్డుకునే పరిస్థితుల్లోనూ పనిచేసే విశ్వసనీయమైన, ప్రత్యామ్నాయ సమాచార నెట్‌వర్క్‌లు అవసరమన్నారు. కృత్రిమ మేధను భవిష్యత్‌ యుద్ధాల్లో ఉపయోగించకుండా ఏ సైనిక దళమూ కొనసాగలేదని జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రహణి స్పష్టం చేశారు. అయితే తుది నిర్ణయం మాత్రం కమాండర్‌దే కావాలని అన్నారు.

కొత్త సాంకేతికతను కొనుగోలు చేస్తే సరిపోదు 
సైనిక డేటాను వివిధ విభాగాలు విడిగా దాచుకోవడం కాకుండా, భద్రతా చర్యలతో పరస్పరం పంచుకోవాలని జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రహణి సూచించారు. భవిష్యత్‌ పోరాటాల్లో భౌతిక ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేయకుండానే వాటి నెట్‌వర్క్‌లు, డేటా, సమాచార సేకరణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తే ఒక సంస్థ పని చేసే సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని వివరించారు.  

కేవలం కొత్త సాంకేతికతను కొనుగోలు చేయడం సరిపోదని, దానికి అనుగుణంగా యుద్ధ విధానం, వ్యూహం, సైనిక నిర్మాణాన్ని మార్చుకోవాలని జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రహణి చెప్పారు. భవిష్యత్‌ యుద్ధాల్లో ముందుండేది మొదటగా సాంకేతికతను అందిపుచ్చుకున్న దళం కాదని, దాన్ని వేగంగా నేర్చుకుని, అనుసరించి, తనను తాను మార్చుకోగల దళమే అని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా, జనరల్‌ చౌహాన్‌ ప్రసంగంలో “ప్లాట్‌ఫామ్‌ల నుంచి ప్రభావాల వైపు, నెట్‌వర్క్‌ ఆధారిత యుద్ధం నుంచి డేటా ఆధారిత యుద్ధం వైపు” మారాల్సిన అవసరాన్ని ప్రధానంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement