ఒక్కసారిగా అదృష్టం తలుపు తెరిచింది.. ఊహించనంత డబ్బు దక్కింది.. | Indian Bangladeshi expats together win e draw Big Ticket | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా అదృష్టం తలుపు తెరిచింది.. ఊహించనంత డబ్బు దక్కింది..

Sep 28 2026 6:19 PM | Updated on Sep 28 2026 7:02 PM

Indian Bangladeshi expats together win e draw Big Ticket

అబుదాబి: సెప్టెంబర్‌ మూడో వారపు బిగ్‌ టికెట్‌ ఎలక్ట్రానిక్‌ డ్రాలో భారత్‌, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు ప్రవాసులు విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరికి 25,000 దిర్హామ్‌ల చొప్పున మొత్తం 1,00,000 దిర్హామ్‌ల నగదు బహుమతి లభించింది. విజేతల్లో తమిళనాడుకు చెందిన మెషీన్‌ల నిర్వాహకుడు, కేరళకు చెందిన డ్రైవర్‌, బంగ్లాదేశ్‌కు చెందిన పెయింటర్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉన్నారు.

తమిళనాడుకు చెందిన అయ్యలు స్వామి (41) గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం భారత్‌లోనే ఉంటోంది. బిగ్‌ టికెట్‌లో తరచుగా పాల్గొనే ఆయన ఈసారి ఒంటరిగానే టికెట్‌ కొనుగోలు చేసి, నంబర్‌ను యాదృచ్ఛికంగా ఎంచుకున్నారు. విజయం సాధించిన విషయం ఫోన్‌ ద్వారా తెలియగానే చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. వచ్చిన డబ్బును భారత్‌లో ఉన్న తన కుటుంబం కోసం వినియోగిస్తానని తెలిపారు. భవిష్యత్తు డ్రాల్లోనూ పాల్గొంటానన్నారు.

మిగతా వారు ఎవరు? ఏమన్నారు? 
బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్‌ బషర్‌ (56) షార్జాలో గత 34 ఏళ్లుగా నివసిస్తున్నారు. తన సోదరుడి ద్వారా బిగ్‌ టికెట్‌ గురించి తెలుసుకున్న ఆయన ప్రస్తుతం 20 మంది స్నేహితులతో కలిసి పాల్గొంటున్నారు. గెలిచిన బహుమతిని బృంద సభ్యుల మధ్య పంచుకోనున్నారు. తన వాటాను కుటుంబానికి పంపడంతో పాటు కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని అబుల్‌ చెప్పారు.  

బంగ్లాదేశ్‌కు చెందిన సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మహమ్మద్‌ షహాదత్‌ హుస్సేన్‌ (38) గత 16 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నారు. ఈసారి 13 మంది స్నేహితులతో కలిసి టికెట్‌ కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా నంబర్‌ను ఎంచుకోకుండా కనిపించిన మొదటి నంబర్‌నే తీసుకున్నారు. వచ్చిన బహుమతిని బృంద సభ్యులతో పంచుకుని, తన వాటాను బంగ్లాదేశ్‌కు పంపాలని భావిస్తున్నారు. ఇకపై ప్రతి నెలా పాల్గొని గ్రాండ్‌ ప్రైజ్‌ గెలిచే వరకు ప్రయత్నిస్తానని చెప్పారు.  

కేరళకు చెందిన డ్రైవర్‌ ఎల్డో మాథ్యూ (30) గత 8 ఏళ్లుగా కువైట్‌లో పనిచేస్తున్నారు. 25 మంది సభ్యులతో కలిసి బిగ్‌ టికెట్‌లో పాల్గొంటున్న ఆయన బృందానికి 25,000 దిర్హామ్‌ల బహుమతి లభించింది. ఈ మొత్తాన్ని 25 మందితో పంచుకోనున్నారు. తన వాటాను ఎలా వినియోగించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ఎల్డో తెలిపారు. అయితే భవిష్యత్తులోనూ బిగ్‌ టికెట్‌లో పాల్గొని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చ‌ద‌వండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement