కెనడా మంత్రి అనితతో జైశంకర్
ఐక్యరాజ్యసమితి: తమ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్, కెనడా సన్నద్ధమవుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. అమెరికాలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ఆయన సమావేశమయ్యారు.
భారత్, కెనడా సంబంధాలపై వారు చర్చించారు. కెనడా విదేశాంగ మంత్రితో భేటీ కలవడం సంతోషదాయకమని జైశంకర్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆమెతో ఫలప్రదమైన చర్చ జరిగిందని వెల్లడించారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మాట్లాడుతూ... భారత్‌తో వాణిజ్య చర్చల్లో కెనడా మంచి పురోగతి సాధిస్తోందని చెప్పారు.


