40 ఏళ్లకే ప్రముఖ రెజ్లర్‌ హఠాన్మరణం, షాక్‌లో అభిమానులు | Former WWE Star Benjamin Satterley Dies At 40 | Sakshi
Sakshi News home page

40 ఏళ్లకే ప్రముఖ రెజ్లర్‌ హఠాన్మరణం, షాక్‌లో అభిమానులు

Sep 28 2026 6:30 PM | Updated on Sep 28 2026 6:39 PM

Former WWE Star Benjamin Satterley Dies At 40

Benjamin Satterley  ప్రముఖ ప్రొఫెషనల్ రెజ్లర్ , ఇంగ్లాండ్‌కు చెందిన బెంజమిన్ సాటర్లీ (40) హఠాన్మరణం  అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.  ఆల్ ఎలైట్ రెజ్లింగ్ (AEW) స్టార్, WWE లో 'నెవిల్లే' (Neville) గా సుపరిచితుడైన  బెంజమిన్ సాటర్లీ  మృతిని AEW  అధికారికంగా ధృవీకరించింది. అద్భుతమైన రింగ్ సామర్థ్యం, హై-ఫ్లయింగ్ రెజ్లింగ్ శైలితో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించు కున్నాడు.  తమ అభిమాన రెజ్లర్‌ అకాల మరణం పట్ల రెజ్లింగ్ పరిశ్రమ  అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే  బెంజమిన్ మరణానికి గల కారణాలుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అభిమానులు సోషల్ మీడియాలో గుండెపోటు కావచ్చని ఊహాగానాలు చేస్తున్నప్పటికీ, దీనిపై స్పష్టత లేదు. ఆయన మరణించడానికి కేవలం 24 గంటల ముందు (సెప్టెంబర్ 26న) చికాగోలో జరిగిన AEW 'ఆల్ అవుట్' (All Out) పే-పర్-వ్యూ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆండ్రే ఎల్ ఇడోలోతో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆయన తలపడ్డారు. అంత బాగా ఆడిన రెజ్లర్ ఒక్కసారిగా మరణించడంతో రెజ్లింగ్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.  

 ఇదీ చదవండి: రూ. 336 కోట్ల స్కామ్‌ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష

ఎవరీ బెంజమిన్ సాటర్లీ  
ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌కు చెందిన సాటర్లీ, 2004లో తన రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. పాక్ అనే రింగ్ పేరుతో సుప్రసిద్ధుడైన బెంజమిన్ శాటర్లీ 'గ్రావిటీ మరువని మనుషుడు' (The Man That Gravity Forgot) గా పేరుగాంచాడు. WWE లో 'నెవిల్లే' పేరుతో NXT ఛాంపియన్‌షిప్, క్రూయిజర్‌వెయిట్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. 2019లో AEW లో చేరి, ఇంటర్నేషనల్ ఛాంపియన్‌గా, వరల్డ్ ట్రియోస్ ఛాంపియన్‌గా సత్తా చాటారు.  

 

ఇదీ చదవండి: 100 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని సతీమణి కన్నుమూత

నిన్న రాత్రి PPVలో రెజ్లింగ్ చేశారు, ఇప్పుడు 24 గంటలకే మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది అస్సలు న్యాయం కాదు. RIP PAC అంటూ  సోషల్‌ మీడియాలో అభిమానుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement