సినీ ఇండస్ట్రీలో విషాదం.. జాతీయ అవార్డ్ నటి కన్నుమూత | National Award winning Malayalam Actress Savithri Sreedharan Passed away | Sakshi
Sakshi News home page

Savithri Sreedharan: సినీ పరిశ్రమలో విషాదం.. జాతీయ అవార్డ్ నటి కన్నుమూత

Sep 24 2026 4:10 PM | Updated on Sep 24 2026 4:12 PM

National Award winning Malayalam Actress Savithri Sreedharan Passed away

సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ సినీ నటి సావిత్రి శ్రీధరన్(78) కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారు. ఆమె మృతిపట్ల కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిఖీ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ఇది మలయాళ కళా ప్రపంచానికి తీరని నష్టమని ఆయన పోస్ట్ చేశారు..

కాగా.. సావిత్రి శ్రీధరన్ తన కెరీర్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'సుదాని ఫ్రమ్ నైజీరియా' అనే చిత్రంలో జమీలా పాత్రకు గానూ ఆమె ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ మూవీలో నటనకు గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. సినీరంగంలోకి రాకముందు.. సావిత్రి నాలుగు దశాబ్దాలకు పైగా వృత్తిపరమైన నాటకరంగంలో రాణించారు.

1991లో  'కడవు' చిత్రంతో సావిత్రి సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట ఆమె నాటకరంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. నాటకరంగంలో ఆమె చేసిన కృషికి గాను.. ఉత్తమ నాటక నటిగా పలు కేరళ రాష్ట్ర అవార్డులతో పాటు, నాటకరంగంలో (ఉత్తమ నటి) కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. 2010లో 'వలియంగాడి' అనే చిత్రంతో సావిత్రి వెండితెరపైకి కనిపించారు. అయితే 'సుదాని ఫ్రమ్ నైజీరియా' చిత్రంలో జమీలా పాత్రతోనే ఆమెకు గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఆమె'డాకిని', 'మేరా నామ్ షాజీ', 'వైరస్', 'ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా', 'పడా', 'పాప్పన్' లాంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరిసారిగా వయసేత్రయాయీ ముప్పతీయే (2024) చిత్రంలో కనిపించింది. ఆమె భర్త శ్రీధరన్ చాలా ఏళ్ల క్రితమే మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement