ఏడాదిలో మూడు సినిమాలు.. దూసుకెళ్తున్న రణ్‌బీర్‌ కపూర్‌ | Ranbir Kapoor First Look Out From Sanjay Leela Bhansali Love And War Movie | Sakshi
Sakshi News home page

ఏడాదిలో మూడు సినిమాలు.. దూసుకెళ్తున్న రణ్‌బీర్‌ కపూర్‌

Sep 24 2026 2:57 PM | Updated on Sep 24 2026 3:09 PM

Ranbir Kapoor First Look Out From Sanjay Leela Bhansali Love And War Movie

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్‌ అండ్‌ వార్‌. అలియా భట్, విక్కీ కౌశల్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్‌  తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఇందులోనూ ఉంటుందని ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ‘లవ్‌ అండ్‌ వార్‌’ను విడుదల చేయనున్నారు.

ఇక రణ్‌బీర్‌ విషయానికొస్తే.. చివరిగా 2023లో ‘యానిమల్’తో పలకరించారు. సందీప్‌వంగా దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘రామాయణ’తో రణ్‌బీర్‌ బిజీ అయ్యారు. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పార్ట్‌-1 చిత్రీకరణ పూర్తి కాగా, తుది మెరుగులు దిద్దుకుంటోంది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబరులో ఈ మూవీ విడుదల కానుంది.

సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్‌ తివారీ దర్శకత్వం వహించారు. ఇక, జనవరి 21న ‘లవ్‌ అండ్‌ వార్‌’ రానుంది. మళ్లీ వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్‌2’ను తీసుకురానున్నారు. దానికి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. మిగిలిన షూటింగ్‌ను కూడా త్వరలోనే పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. అంటే ఏడాది కాలంలో మూడు సినిమాలతో రణ్‌బీర్‌ అలరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement