కుటుంబ బంధాలపై బిగ్‌బాస్‌ ట్విస్ట్‌.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ | Bigg Boss Season 10 Telugu Day 18 Promo | Sakshi
Sakshi News home page

Bigg Boss Promo: కుటుంబ బంధాలపై ఝాన్సీకి కఠిన పరీక్ష

Sep 24 2026 2:52 PM | Updated on Sep 24 2026 2:57 PM

Bigg Boss Season 10 Telugu Day 18 Promo

బిగ్‌బాస్‌ ఇంట్లో ఈ వారం టెమ్‌టేషన్స్‌, ఎమోషన్స్‌ రెండూ తారాస్థాయికి చేరినట్లు తాజా ప్రొమో చూస్తే అర్థమవుతోంది. లివింగ్‌ రూం హౌస్‌లో ముందుగా బజర్‌ నొక్కింది వంశీ అని త్రిగుణ్‌ చెప్పగా, నొక్కింది నేనే అని నరేశ్‌ వాదించాడు. ‘నేను చెప్పినా వినకపోతే నేనేం చేస్తా?’ అంటూ నరేశ్‌ ప్రశ్నించగా, ‘నేను చూసిన దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటా’ అని త్రిగుణ్‌ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆమె ఎవరిని ఎంచుకుంటుంది?
ఇక కెప్టెన్సీ కంటెండర్‌గా మారేందుకు ఝాన్సీ, వంశీకి ఇచ్చిన టాస్క్‌ కూడా ఆసక్తికరంగా సాగినట్లు ప్రొమోలో కనిపించింది. అయితే అసలు ట్విస్ట్‌ తరువాతే వచ్చింది. ఝాన్సీని పిలిచిన బిగ్‌బాస్‌.. ‘నీ మనసుకు దగ్గరైన టెమ్‌టేషన్‌ నీ చేతికి అందే ముందు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా’ అని చెప్పాడు. మొదటి ఆప్షన్‌గా నరేశ్‌కు అతని తమ్ముడు రాసిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని, రెండో ఆప్షన్‌గా రాంప్రసాద్‌కు వారి కుటుంబంతో దిగిన ఫోటోను దూరం చేయాలని బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ రెండు ఆప్షన్లు విన్న వెంటనే ఝాన్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరిని ఎంచుకుంటుంది? నరేశ్‌ లేఖనా? రాంప్రసాద్‌ ఫోటోనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement