సాధారణంగా కొన్ని వారాలు అయిపోయిన తర్వాత బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి మూడో వారానికే అదంతా దర్శనమిచ్చింది. హౌస్‌లో 17వ రోజైన బుధవారం(సెప్టెంబరు 24) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? ఎవరెవరు కన్నీళ్లు పెట్టుకున్నారు?
(ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ)
దేబ్జానీ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ని ముకేశ్ నాశనం చేయడంతో ఈమె కుమిలి కుమిలి కుమిలి ఏడ్చింది. బాధలో ఉన్న దేబ్జానీని రాంప్రసాద్, నరేశ్ కలిసి కాసేపు నవ్వించారు. తర్వాత చెప్పినట్లు తండ్రితో ఉన్న ఫొటోని ముకేశ్ కోసం బిగ్‌బాస్.. హౌస్‌లోకి పంపించాడు. ఇదలా ఉండగానే దేబ్జానీ, రోహిత్ మధ్య పెళ్లిచూపుల పెట్టిన రాంప్రసాద్, నరేశ్ కాసేపు నవ్వించారు. నీ జీతం ఎంత? మా అమ్మాయికి నెలకు రూ.2 లక్షలు కావాలని జోకులు వేస్తూ ఫన్ జనరేట్ చేశారు. మరోవైపు వంశీ, త్రిగుణ్ వంట చేసేటప్పుడు ఓ రోజంతా వీళ్ల నోటికి ప్లాస్టర్ వేయమని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి కెప్టెన్ ఝాన్సీ గుర్తుచేసింది. దీంతో బిగ్‌బాస్ ప్లాస్టర్స్ పంపగా.. వీళ్లిద్దరి నోటికి అవి అంటించారు.
ఇక కెప్టెన్సీ కంటెండర్ కోసం మళ్లీ పోటీ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. గెలిచిన ముకేశ్, ఓడిన దేబ్జానీ ఆడేందుకు అర్హులు కాదని చెప్పాడు. వీళ్లిద్దరినే ఈ టాస్క్‌కు సంచాలకులుగా నియమించారు. ఈసారి పోటీలో వర్షిణి, అమన్ గెలవగా.. పూల్‌లో దూకి అందులో ఉన్న బ్యాగుల్లో ఒకసారి ఒకటి మాత్రమే తీసుకోవాలి. తర్వాత వాటిని తీసుకొచ్చి ఎవరి కలర్ ప్లేమ్స్‌లో వాళ్లు ల్యాండ్ అయ్యేలా విసరాలి. ఈ క్రమంలో ఎవరివైనా కిందపడితే వాళ్లవి కూడా తీసుకోవచ్చుని బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో అమన్ గెలిచాడు.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)
అమన్‌కు ఫోన్ చేసిన బిగ్‌బాస్.. అమ్మ మీకు ఎంతో ఇష్టమైన భోజనాన్ని పంపించారు. అది మీకు కావాలంటే వేరే వాళ్లకు టెన్షన్ ఇవ్వాలి. షాలినీ, రోహిత్‌లలో ఒకరికి టెన్షన్ పెట్టాలని అనగా.. రోహిత్ పేరుని అమన్ చెప్పాడు. దీంతో రోహిత్‌కు లెటర్‌ని నాశనం చేయగా అతడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈసారి బజర్‌ని సుధీర్, సృష్టి మోగించగా.. వీళ్లిద్దరికీ ఓ టాస్క్ ఆడారు. ఇందులో సృష్టి గెలిచింది.
టాస్క్‌లో విజయం సాధించిన సృష్టికి ఫోన్ చేసిన బిగ్‌బాస్.. మీ అమ్మ ప్రేమతో ఉత్తరం రాసింది. అది కావాలంటే ఇంటి సభ్యుల్లో ఒకరికి టెన్షన్ ఇవ్వాలి. వంశీ, త్రిగుణ్‌లో ఒకరికి వారి భార్యలు రాసిన ఉత్తరాలని అందకుండా చేయాలని చెప్పడంతో సృష్టి.. త్రిగుణ్‌కు టెన్షన్ ఇస్తానని చెప్పింది. సృష్టి త్రిగుణ్ లెటర్ నాశనం చేయడంతో ఇతడు ఎమోషనల్ అయ్యాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: 7 సినిమాలు చేస్తున్నా.. రోజుకు ఎంత సంపాదిస్తానంటే?: కుమారి ఆంటీ)


