ఖైరతాబాద్: శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతి దర్శనాలు బుధవారంతో ముగియడంతో నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
గురువారం ఉదయం నుంచి షెడ్డు తొలగింపు, నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేసి శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
ఖైరతాబాద్ రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్‌మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నెం– 4 వద్ద నిమజ్జనం చేసేలా పోలీసులు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు.
గత ఏడాది లాగే ఈసారి కూడా ఎం.వెంకట్‌రెడ్డి మహాగణపతి రథసారథిగా వ్యవహరించనున్నారు.


