'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్ | KCR And NTR Charecters In Nani Paradise Movie | Sakshi
Sakshi News home page

Paradise Movie KCR-NTR: కేసీఆర్‌గా ప్రియదర్శి.. మరి ఎన్టీఆర్‌గా ఎవరంటే?

Sep 24 2026 9:00 AM | Updated on Sep 24 2026 9:01 AM

KCR And NTR Charecters In Nani Paradise Movie

నాని 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. మూవీ ఫలితం సంగతి పక్కనబెడితే ఇందులో కొన్ని అంశాలు.. ప్రేక్షకుల్ని అలరించాయి. వాటిలో కేసీఆర్, ఎన్టీఆర్‌ని పోలిన పాత్రలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటి గురించే సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

1980ల్లో ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కల్పిత కథతో 'ప్యారడైజ్' సినిమా తీశారు. ఇందులో గుర్తింపు కోసం పోరాడే సవారీ తెగకు అండగా నిలబడే ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి నటించాడు. అయితే ఈ పాత్రని చూస్తున్నంతసేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే గుర్తొస్తారు. ఈ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి.

అలానే సీనియర్ ఎన్టీఆర్‌గా పి.విజయ్ కుమార్ నటించారు. గతంలో 'లక్ష‍్మీస్ ఎన్టీఆర్'లో నటించింది ఈయనే. కేసీఆర్‌ని పోలిన పాత్రకు ‍స్క్రీన్ స్పేస్, డైలాగ్స్ ఉన్నాయి గానీ ఎన్టీఆర్ రోల్ జస్ట్ అలా కనిపించి వెళ్లిందంతే. సవారీలు నివసించే ప్రాంతానికి ఎమ్మెల్మే శంకరన్న పాత్ర ముఖ్యమంత్రిని తీసుకొస్తారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ అనే పేరు ఎక్కడా ఉపయోగించలేదు. కానీ పాత్రలు చూస్తే ఎవరికైనా అవి ఎవరనేది అర్థమైపోతుంది. ఇలా సినిమాలో ఈ రెండు పాత్రల్ని చూపించి సర్‌ప్రైజ్ చేశారని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: నాని 'ప్యారడైజ్' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement