‘షో’ సారీ నాని! | Police Denies Permission To Nani | Sakshi
Sakshi News home page

‘షో’ సారీ నాని!

Sep 24 2026 8:35 AM | Updated on Sep 24 2026 8:35 AM

Police Denies Permission To Nani

సాక్షి, హైదరాబాద్‌: తన తాజా సినిమా ప్యారడైజ్‌ ప్రీమియర్‌ షోను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి చూడాలన్న హీరో నాని విజ్ఞప్తికి నగర పోలీసులు నో చెప్పారు. శుక్రవారం శోభాయాత్ర నేపథ్యంలో ఆ షోకు బందోబస్తు కల్పించలేమని బుధవారం స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందని నాని బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని ‘ఎక్స్‌’ద్వారా అభ్యర్థించారు. 

దీనిపై స్పందించిన సీఎం, స్థానిక పోలీసుస్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు డీజీపీనీ ఆయన ట్యాగ్‌ చేశారు. డీజీపీ నగరంలో గణేశ్‌ నిమజ్జన వేడుకలు ముమ్మరంగా జరుగుతుండటం వల్ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉందని సమాధానం ఇస్తూ నగర కొత్వాల్‌ సజ్జనర్‌ను ట్యాగ్‌ చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన నగర పోలీసులు ప్రీమియర్‌ షో చూడటానికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ రావడానికి నానికి అనుమతివ్వలేదు. 

‘ది ప్యారడైజ్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement