నిమజ్జన విధులకు వచ్చిన ఎస్‌ఐ మృత్యువాత | Tragedy During Ganesh Immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జన విధులకు వచ్చిన ఎస్‌ఐ మృత్యువాత

Sep 24 2026 8:08 AM | Updated on Sep 24 2026 9:14 AM

Tragedy During Ganesh Immersion

హైదరాబాద్: వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల కోసం హైదరాబాద్‌ వెళ్లిన కొత్తగూడెం టూ టౌన్‌ ఎస్‌ఐ కున్సోతు వెంకన్న(57) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వెంకన్న కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తుండగా ఇటీవలే మహబూబాబాద్‌కు బదిలీ అయింది. ఇంతలోనే గణేష్‌ నిమజ్జనం విధులు కేటాయించగా, బుధవారం తెల్లవారుజామున 2గంటల సమయాన ట్యాంక్‌బండ్‌ సమీపం నుంచి వెళ్తుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. 

 

ఘటనలో వెంకన్న తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా పోలీసులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపించడంతో హనుమకొండకు తరలించి మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా రాత్రి 6గంటలకు మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడి జాడ కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్‌ బదిలీ అయిన వెంకన్న గణేష్‌ నిమజ్జనం అనంతరం రిలీవ్‌ కావాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, అల్లుడు మణుగూరు బీటీపీఎస్‌లో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి: రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement