ప్రియుడే హంతకుడా? | Madhapur OYO Room Incident | Sakshi
Sakshi News home page

ప్రియుడే హంతకుడా?

Sep 24 2026 8:02 AM | Updated on Sep 24 2026 8:02 AM

Madhapur OYO Room Incident

హైదరాబాద్‌: ప్రియుడే హంతకుడా? ఓయో రూంలో విగతజీవిగా పడి ఉన్న యువతిని ఆసుపత్రిలో చేర్చి చనిపోయిందని తెలియడంతో ప్రియుడు శ్రీనివాస రవితేజ పరారైన విషయం తెలిసిందే. గదిలో రక్తపు మరకలు ఉండడం, ప్రియుడు పరారు కావడంతో అతనే హత్య చేశాడనే అనుమానాలకు బలం చేకూరుతోంది. గదిలో మద్యం బాటిళ్లు, రక్తపు మరకలు ఉండడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. 

ఓయో నిర్వాహకులకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాదాపూర్‌లోని గుట్టలబేగంపేట్‌ ఓయో రూమ్‌ హత్యకేసులో బుధవారం జార్ఖండ్‌ నుంచి వచి్చన తల్లిదండ్రులు ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు షారోన్‌ నిఖిత టోప్నో మృతదేహాన్ని ఆమె తండ్రికి  అప్పగించారు.  నిందితుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement