యశవంతపుర: బెంగళూరు కేఆర్ పురలో తల్లిదండ్రులు, చెల్లెలిని ఓ మహిళా టెక్కీ, ఆమె ప్రియునితో కలిసి హత్య చేసిన కేసులో చాషిటు దాఖలు చేశారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని, డబ్బుల గొడవలతో సొంత కుమార్తే తల్లిదండ్రులను నరికి చంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. జూన్ 23న ప్రియుడు కెన్నెత్‌తో కలిసి టెక్కీ శ్వేత తన తల్లి ముత్తులక్ష్మి, తండ్రి సోమసుందర్, చెల్లెలు సుప్రియాను కత్తులతో పొడిచి చంపింది. పోలీసులు సంపూర్ణ విచారణ చేసి 2,085 పేజీలతో భారీ చాషిట్‌ను కోర్టుకు సమరి్పంచారు. శ్వేత వద్ద నుంచి తల్లిదండ్రులిద్దరూ డబ్బులు తీసుకొనేవారు.
ఇది ఆమెకు నచ్చేది కాదు, వారు లేకపోతే తమ డబ్బుతో విలాసంగా ఉండవచ్చని శ్వేత అనుకుంది. అలాగే శ్వేత, కెన్నెత్ మధ్య రూ.55 లక్షల లావాదేవీలు జరిగాయి, ఆ డబ్బులు చెల్లించాలని కెన్నెత్ ఒత్తిడి చేయడంతో ఆమె అప్పు తీసుకుని కెన్నెత్‌కు ఇచ్చింది. చెల్లెలు, తల్లిదండ్రులు లేకుంటే తమను అడిగేవారు ఉండరనే ఉద్దేశంతో హత్యాకాండకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కాగా నిందితులు కారాగారంలో ఉన్నారు.


