అక్రమార్కుల ఆస్తులు రూ.23 కోట్లు | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కుల ఆస్తులు రూ.23 కోట్లు

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని రాష్ట్రంలోని 8 మంది ప్రభుత్వ అదికారుల ఇళ్లు, ఆఫీసుల్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేయడం తెలిసిందే. బెంగళూరు, రామనగర, చిక్కబళ్లాపుర, మండ్య, కొడగు, కలబుర్గి, ధార్వాడ, బీదర్‌ జిల్లాల్లో 33 స్థలాల్లో దాడులు జరిగాయి. పొలాలు, స్థలాలు, విలాసవంతమైన ఇళ్లు, విలువైన వస్తువులు, బంగారువెండి ఆభరణాలు, నగదుతో కలిపి మొత్తం రూ.23.24 కోట్ల విలువచేసే ఆస్తులను కనిపెట్టినట్లు ప్రకటించారు.

పలు జిల్లాల్లో వర్షాలు

యశవంతపుర: రాష్ట్రంలో బుధవారం అనేక ప్రాంతాలలో వర్షం కురిసింది. కొప్పళ, గదగ్‌, కార్వారలో భారీ వర్షం పడింది. రైతులు అనందం వ్యక్తం చేశారు. మళెనాడు ప్రాంతాల్లో ఓ మోస్తారు వానలు పడుతున్నాయి. ఉత్తరకన్నడ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. కొప్పళలో జడివానతో జనజీవనం స్తంభించింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఆటంకం కలిగింది. గదగ్‌ జిల్లాలో నీరలగి–నాగరాళ మధ్య ఉన్న వాగు జోరందుకుంది. వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఓ కారు మధ్యలో చిక్కుకోని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారులో చిక్కుకున్న నలుగురిని స్థానికులు రక్షించారు. బెంగళూరులో తుంపర్లు పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement