హైదరాబాద్‌ టు బెంగళూరు విమానాల్లో దొంగ విలాసం | Hyderabad to Bangalore Luxury Thief | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు బెంగళూరు విమానాల్లో దొంగ విలాసం

Sep 24 2026 11:44 AM | Updated on Sep 24 2026 11:50 AM

Hyderabad to Bangalore Luxury Thief

 బెంగళూరు: విమానంలో బెంగళూరుకు వచ్చి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి మళ్లీ అదే మార్గంలో వెళ్లిపోయే లగ్జరీ దొంగను విల్సన్‌ గార్డెన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దొంగ నుంచి రూ.42 లక్షల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్‌కుమార్‌ (32) నిందితుడు. దొంగతనాలే అతని వృత్తి, ఇతనిపై తెలంగాణలో 28 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో–1, బెంగళూరులో 1 చోరీ కేసులున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. 

విల్సన్‌ గార్డెన్‌ 10వ క్రాస్‌లో ఓ ఇంటిలోనివారు నిద్రిస్తుండగా వినోద్‌కుమార్‌ కిటికీని ధ్వంసం చేసి చొరబడ్డాడు, బీరువాలోని బంగారం, విదేశీ కరెన్సీ, ఐప్యాడ్‌ను ఎత్తుకెళ్లాడు. ఇంట్లోనివారు తెల్లవారున లేచి చూడగా చోరీ బయట పడింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలించి, బెంగళూరు వద్ద కెంపేగౌడ విమానాశ్రయంలో ఉండగా పట్టుకున్నారు. అతని నుంచి 271 గ్రాముల బంగారంతో పాటు విదేశీ కరెన్సీ నోట్లు, ఐప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు చేసేవాడని, బెంగళూరు– హైదరాబాద్‌ మధ్య విమానాల్లో వచ్చి వెళ్లేవాడని తెలిపాడు.   

తక్కువ ధర కార్లను కొనొద్దు: కమిషనర్‌   
తక్కువ ధరలకు కార్లు వస్తున్నాయని కొనవద్దని నగరవాసులకు పోలీసు కమిషనర్‌ సీమంత్‌కుమార్‌ సింగ్‌ సూచించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. విల్సన్‌ గార్డెన్, అన్నపూర్ణేశ్వరినగర ఠాణాల పరిధిలో చోరీలకు గురైన 24 కార్లను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. చవగ్గా వస్తున్నాయని కార్ల పత్రాలు అసలైనవో, నకిలీవో చూసుకోకుండా కొనవద్దన్నారు. అనుమానం వస్తే ఆర్‌టీఒ అఫీసుకెళ్లి తెలుసుకోవాలన్నారు. నకిలీ పత్రాలతో తయారు చేసిన దొంగ కార్లను కొంటే మోసపోతారన్నారు. ఈ కేసుల్లో నకిలి ఆర్‌సీ, బ్యాంక్‌ ఎన్‌ఒసి పత్రాలను స్వా«దీనం చేసుకొని నిందితులను విచారిస్తున్నారు.  

60 బైక్‌ల సీజ్‌ 
బెంగళూరు తూర్పు పోలీసులు 60 బైకులను     స్వా«దీనం చేసుకున్నారు. రాత్రివేళల్లో గాలింపు జరిపి అనుమానితుల నుంచి బైక్‌లను సీజ్‌ చేశారు. 35 చోట్ల నాకాబందీ నిర్వహించారు. 900 బైకులు, 150 ఆటోలు, 75 కార్లను తనిఖీలు చేశారు. అలాగే 4 డ్రగ్స్‌ కేసులు, 11 అనుమానాస్పద వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement