breaking news
Hyderabad to Bangalore
-
హైదరాబాద్ టు బెంగళూరు విమానాల్లో దొంగ విలాసం
బెంగళూరు: విమానంలో బెంగళూరుకు వచ్చి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి మళ్లీ అదే మార్గంలో వెళ్లిపోయే లగ్జరీ దొంగను విల్సన్ గార్డెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి రూ.42 లక్షల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్‌కుమార్ (32) నిందితుడు. దొంగతనాలే అతని వృత్తి, ఇతనిపై తెలంగాణలో 28 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో–1, బెంగళూరులో 1 చోరీ కేసులున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్‌లో ఓ ఇంటిలోనివారు నిద్రిస్తుండగా వినోద్‌కుమార్ కిటికీని ధ్వంసం చేసి చొరబడ్డాడు, బీరువాలోని బంగారం, విదేశీ కరెన్సీ, ఐప్యాడ్‌ను ఎత్తుకెళ్లాడు. ఇంట్లోనివారు తెల్లవారున లేచి చూడగా చోరీ బయట పడింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలించి, బెంగళూరు వద్ద కెంపేగౌడ విమానాశ్రయంలో ఉండగా పట్టుకున్నారు. అతని నుంచి 271 గ్రాముల బంగారంతో పాటు విదేశీ కరెన్సీ నోట్లు, ఐప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు చేసేవాడని, బెంగళూరు– హైదరాబాద్ మధ్య విమానాల్లో వచ్చి వెళ్లేవాడని తెలిపాడు. తక్కువ ధర కార్లను కొనొద్దు: కమిషనర్ తక్కువ ధరలకు కార్లు వస్తున్నాయని కొనవద్దని నగరవాసులకు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ సూచించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. విల్సన్ గార్డెన్, అన్నపూర్ణేశ్వరినగర ఠాణాల పరిధిలో చోరీలకు గురైన 24 కార్లను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. చవగ్గా వస్తున్నాయని కార్ల పత్రాలు అసలైనవో, నకిలీవో చూసుకోకుండా కొనవద్దన్నారు. అనుమానం వస్తే ఆర్టీఒ అఫీసుకెళ్లి తెలుసుకోవాలన్నారు. నకిలీ పత్రాలతో తయారు చేసిన దొంగ కార్లను కొంటే మోసపోతారన్నారు. ఈ కేసుల్లో నకిలి ఆర్సీ, బ్యాంక్ ఎన్ఒసి పత్రాలను స్వా«దీనం చేసుకొని నిందితులను విచారిస్తున్నారు. 60 బైక్‌ల సీజ్ బెంగళూరు తూర్పు పోలీసులు 60 బైకులను స్వా«దీనం చేసుకున్నారు. రాత్రివేళల్లో గాలింపు జరిపి అనుమానితుల నుంచి బైక్‌లను సీజ్ చేశారు. 35 చోట్ల నాకాబందీ నిర్వహించారు. 900 బైకులు, 150 ఆటోలు, 75 కార్లను తనిఖీలు చేశారు. అలాగే 4 డ్రగ్స్ కేసులు, 11 అనుమానాస్పద వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. -
తప్పిన పెను ప్రమాదం
–ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సులో మంటలు –టోల్గేట్ వద్ద ఘటన – సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కృష్ణగిరి: బెంగళూరుకు చెందిన ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు కాలిబూడిదైంది. జాతీయ రహదారిలోని అమకతాడు టోల్గేట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే.. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన కేఏ01 ఏబీ 6198 నంబర్ గల ప్రైవేట్ బస్సు హైదరబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.10గంటలకు కృష్ణగిరి మండల పరిధిలోని టోల్గేట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న టోల్‌గేటు సిబ్బంది, స్థానిక పోలీసులు బస్సులో నుంచి పొగ రావడం గమనించి వెంటనే డ్రైవర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే వారి సహకారంతో బస్సులోని 20మంది ప్రయాణికులను కిందకు దించారు. వారు దిగి అలా పక్కకు వెళ్లగానే పెద్ద మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. డోన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. బస్సు ఇంజన్ హీట్ అయి మంటలు రేగినట్లు డ్రైవర్ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. మంటలను గమనించకుంటే.. టోల్గేట్ దగ్గర స్థానికులు మంటలను గమనించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. టోల్‌గేటు దాటిన తర్వాత మార్గమధ్యంలో మంటలు వ్యాపించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. ప్రయాణికులకు ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండేది. తమ అదృష్టం బాగుందని టోల్గేట్ సిబ్బందికి, స్థానిక పోలీసులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత పోలీసులు వారిని బెంగుళూరు వైపు వెళ్లే మరో బస్సులో ఎక్కించి పంపారు. -
బెంగుళూరు వెళ్తున్న బస్సులో మంటలు


