80లు, 90లలో భారతీయ పాఠశాలలు, విద్యా చార్టులలో ఒక పోస్టర్ బాయ్ ఉండేవాడు. ఆ బాయ్ స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్, అంతేగాదు స్కూల్‌లో చిన్నారులు మంచివ్యక్తిలా ఎలా ఉండాలో చెప్పేందుకు తరుచుగా ఉపయోగించేవారు. నిజానికి ఆ పాత్ర కనుమరుగైపోయింది. మళ్లీ ఆ పాత్రను డిజైనర్ ప్రియేష్ త్రివేది ఫ్యాషన్‌గా స్ఫూర్తిగా చేసిన పునః సృష్టి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది.
నిజానికి ఆ పోస్టర్ బాయ్ ఉదయాన్నే నిద్రలేచి, తల్లిదండ్రులకు నమస్కరించి..పళ్లు తోముకుని స్నానం చేసి, పాఠశాలకు శ్రద్దగా హజరవ్వడం. అలాగే వేళకు భోజనం చేసి, ఆటల్లో చురుగ్గా పాల్గొనడం వంటి సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే స్ఫూర్తిదాయ బాలుడి పోస్టర్ అది. ప్రతి బిడ్డ అలానే ఉండాలని చెప్పే ఆ పోస్టర్ ప్రియేష్ త్రివేది కారణంగా ఫ్యాషన్ వేదికపై మరోసారి ప్రత్యక్షమైంది.
ఈ మేరకు లండ్ ఫ్యాషన్ వీక్ రన్‌వేపై లవ్‌బర్డ్స్ స్టూడియో తమ కలెక్షన్‌ను ప్రదర్శిస్తుండగా..ఒక మోడల్ డ్రెస్ పై ఈ ఆదర్శ బాలక్ పోస్టర్ కనిపించింది. ఆ మోడల్ మొత్తం నీలి రండగుల డిజైన్‌తో ఉన్న స్ట్రాప్‌లెస్ గౌనుని ధరించింది. ఆ గౌను మందు భాగంలో ఆదర్శ బాలక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లండన్ ఫాషన్‌రన్‌వే కలెక్షన్‌లలో ఇదే అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అలాగే ఈ రన్‌వేపై చేనేత వస్త్రాలు కూడా ప్రదర్శితమైన భారత హస్తకశా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి.
గుజరాత్‌లోని కచ్, ఉత్తప్రదేశ్‌లోని వారణాసికి చెందిన కళాకారులు ఈ వస్త్రాలను రూపొందిచినట్లు సమాచారం. ప్రియేష్ స్వతహాగా ఆదర్శ్ బాలక్‌లా ఉండడు కానీ తమ దృశ్య భావనలను అతడు చాలా ఓపిగ్గా మెరుగుపరిచినట్లు మైంత్రా సంస్థ పేర్కొంది. బ్యాంక్సీ శైలిలో ఈ ఫ్యాషన్‌ని ప్రదర్శించినట్లు టాలెంటెడ్ ఏజెన్సీ వ్యవస్థాపక సభ్యురాలు పూజా మానేక్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విమానం విండోపై గణేశుడి చిత్రం..! మండిపడుతున్న నెటిజన్లు)


