యా అల్లాహ్‌.. వర్షం కురిపించు | - | Sakshi
Sakshi News home page

యా అల్లాహ్‌.. వర్షం కురిపించు

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

తుమకూరు: బంగాళాఖాతంలో తుపానులు చెలరేగడంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అనేక జిల్లాల్లో నెలల తరబడి మంచి వానలు కురిసింది లేదు. దీంతో పంటలు ఎండిపోవడంతో పాటు మనుషులకు కూడా నీటి కొరత తీవ్రమైంది. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో పిల్లలకు పెళ్లిళ్లు, గాడిదలకు వివాహాలు, హరికథలు వంటి సంప్రదాయాలను ఆచరిస్తున్నారు. శిర తాలూకాలోని బుక్కపట్టణ గ్రామానికి చెందిన ముస్లింలు వర్షాలు కురిపించాలని అల్లాను వేడుకుంటూ సామూహిక ప్రార్థనలు చేశారు. దండిగా వానలు పడి అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. జామియా మసీదు, బిలాల్‌ మసీదుల ముతవల్లీలు, ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

దర్శన్‌ భార్య అర్జీ కొట్టివేత

ప్రదూష్‌కు ఆమోదం

బనశంకరి: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న రెండవ నిందితుడు, నటుడు దర్శన్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. 14వ నిందితుడు ప్రదూష్‌ అప్రూవర్‌ కావడాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్‌ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్‌ వీ.శ్రీశానంద విచారించారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా మారిన ప్రదూష్‌ ను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి మీకు పూర్తి హక్కు ఉందని విజయలక్ష్మికి జడ్జి సూచించారు. విచారణ సమయంలో మీ క్లయింట్‌ (దర్శన్‌) హాజరు కావడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చారన్నారు. ప్రదూష్‌ జైల్లో మొబైల్‌ఫోన్‌తో ఇతరులను చట్టవిరుద్ధంగా సంప్రదించాడని, ఒత్తిడికిలోనై సాక్షిగా మారాడని చేసిన వాదనలను జడ్జి తిరస్కరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రదూష్‌ భార్యతో మాట్లాడారు, ఇందులో ఎలాంటి దోషం లేదన్నారు. మరుసటిరోజే సాక్షిగా మారేందుకు ప్రాసిక్యూషన్‌ అంగీకరించడంలో కూడా ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డారు.

కారు– బస్సు ఢీ,

ఇద్దరికి గాయాలు

శివమొగ్గ: బుధవారం ఉదయం శివమొగ్గ వద్ద హొసనగర తాలూకాలోని సుదూర్‌ గేట్‌ దగ్గర శివమొగ్గ నుంచి కుందాపురకు వెళ్తున్న గజానన బస్సు, రిప్పన్‌పేట నుంచి శివమొగ్గ వైపు వస్తున్న ఆల్టో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని శివమొగ్గలోని మెగ్గాన్‌ ఆసుపత్రిలో చేర్పించారు. బస్సులోనివారు క్షేమంగా బయటపడ్డారు. కారు బాగా ధ్వంసమైంది. రిప్పన్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement