దొడ్డబళ్లాపురం: ఊరగాయ లేదా ఆవకాయను చాలామంది భోజనంలో ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో ఉప్పు, కారం, నూనె వంటి దినుసులు అధికంగా ఉన్నా పట్టించుకోరు. కానీ ఇలా ఊరగాయ తినడం ఆరోగ్యానికి అపాయం అని పలు అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాలపై ముద్రించినట్టుగానే ఊరగాయ/ ఆవకాయ సీసాలు, పాకెట్లపై కూడా ఇలాంటి సూచన ముద్రించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆలోచిస్తోంది.
దుష్పరిణామాలున్నాయి: మంత్రి ఖాదర్
ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్నందున రాష్ట్రంలో పలు రకాల ఊరగాయల వాడకాన్ని నియంత్రించాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఊరగాయల వాడకం వల్ల కలిగే దష్పరిణామాలను ప్రజలకు వివరించేలా పాకెట్లపై ఈ విధంగా ముద్రించాలని ఆలోచిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉప్పు, చక్కెర వాడకం విపరీతంగా పెరిగిందని, వీటిని తక్కువా వాడాలని ప్రజల్లో జాగృతి కల్పించాలన్నారు. గత ప్రభుత్వంలో చక్కెర,ఉప్పు సబ్సిడీ కింద అందించేవారని, అయితే వాటి ఉపయోగం వల్ల దష్పరిణామాలు కలుగుతాయని సబ్సిడీ ఎత్తివేశామని చెప్పారు.
ఆ ప్యాకెట్లు, సీసాలపై ముద్రించాలని
వైద్య
ఆరోగ్యశాఖ యోచన


