డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య | - | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

శ్వేత, కెన్నెత్‌పై

2వేల పేజీలతో చార్జిషీటు

యశవంతపుర: బెంగళూరు కేఆర్‌ పురలో తల్లిదండ్రులు, చెల్లెలిని ఓ మహిళా టెక్కీ, ఆమె ప్రియునితో కలిసి హత్య చేసిన కేసులో చార్జిషీటు దాఖలు చేశారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని, డబ్బుల గొడవలతో సొంత కుమార్తే తల్లిదండ్రులను నరికి చంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. జూన్‌ 23న ప్రియుడు కెన్నెత్‌తో కలిసి టెక్కీ శ్వేత తన తల్లి ముత్తులక్ష్మి, తండ్రి సోమసుందర్‌, చెల్లెలు సుప్రియాను కత్తులతో పొడిచి చంపింది. పోలీసులు సంపూర్ణ విచారణ చేసి 2,085 పేజీలతో భారీ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. శ్వేత వద్ద నుంచి తల్లిదండ్రులిద్దరూ డబ్బులు తీసుకొనేవారు. ఇది ఆమెకు నచ్చేది కాదు, వారు లేకపోతే తమ డబ్బుతో విలాసంగా ఉండవచ్చని శ్వేత అనుకుంది. అలాగే శ్వేత, కెన్నెత్‌ మధ్య రూ.55 లక్షల లావాదేవీలు జరిగాయి, ఆ డబ్బులు చెల్లించాలని కెన్నెత్‌ ఒత్తిడి చేయడంతో ఆమె అప్పు తీసుకుని కెన్నెత్‌కు ఇచ్చింది. చెల్లెలు, తల్లిదండ్రులు లేకుంటే తమను అడిగేవారు ఉండరనే ఉద్దేశంతో హత్యాకాండకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కాగా నిందితులు కారాగారంలో ఉన్నారు.

సీఎం డీకేపై కుమార ధ్వజం

శివాజీనగర: కేపీఎస్‌సీ మూసివేతపై యోచిస్తున్నానని సీఎం డీకే శివకుమార్‌ చెప్పడం చూస్తే చట్టాల ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేదని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు. ఆయన మాటలు నిరాశకు గురిచేయడమే కాక, మూర్ఖత్వం, బాధ్యతారహిత్యం, అజ్ఞానానికి పరాకాష్ట అని బుధవారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. జ్వరం వస్తే దున్నపోతుకు పెన్ను పెట్టడం లాంటిది, జలుబు చేస్తే ముక్కుకు కత్తెర పెట్టడం లాంటిది అన్నట్లుగా డీకే వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కేపీఎస్‌సీలో వసూళ్ల పాపం ఎవరిదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement