బెంగళూరు: శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కోలారు జిల్లాలోని బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి, కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. వివాదం ఎలా మొదలైందంటే.. ఎమ్మెల్యే నారాయణస్వామి, బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వెనుక సీటు నుంచి రూపా వచ్చి చేయి చూపిస్తూ నారాయణ స్వామితో కోపంగా మాట్లాడారు.
ఈ ఘర్షణకు కచ్చితమైన కారణం ఏమిటని తెలియరాలేదు. తన గురించే ఏదో మాట్లాడుతున్నాడని ఆమె అనుమానించడమే కారణమై ఉంటుందని అనుకుంటున్నారు. రూపా టేబుల్‌పై చేత్తో కొడుతూ హెచ్చరికలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కనిపించింది. ఆ సమయంలో మంత్రి, ఆమె తండ్రి మునియప్ప కూడా సభలో ఉన్నారు. బీజేఎల్పీ నేత అశోక్ స్పందిస్తూ.. చూడండీ.. అక్కడొక గొడవ జరుగుతోంది, మౌనంగా ఉండమ్మా, వారిని కొట్టవద్దు అని వ్యంగ్యంగా అన్నారు. ఈ రభస అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏం జరిగిందో అని ఆసక్తిగా వీక్షించారు. ఒకే జిల్లా, ఒకే పార్టీ ఎమ్మెల్యేల రగడ తీవ్ర చర్చనీయాంశమంది.
ఇదీ చదవండి: సీజేపీ నెక్స్ట్ మిషన్.. మరికాసేపట్లో బిగ్ అనౌన్స్‌మెంట్?


