దర్శన్‌ భార్య అర్జీ కొట్టివేత | Darshan Vijayalakshmi legal battle | Sakshi
Sakshi News home page

దర్శన్‌ భార్య అర్జీ కొట్టివేత

Sep 24 2026 7:42 AM | Updated on Sep 24 2026 7:42 AM

Darshan Vijayalakshmi legal battle

కర్ణాటక : చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న రెండవ నిందితుడు, నటుడు దర్శన్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. 14వ నిందితుడు ప్రదూష్‌ అప్రూవర్‌ కావడాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్‌ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్‌ వీ.శ్రీశానంద విచారించారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

ఈ కేసులో సాక్షిగా మారిన ప్రదూష్‌ ను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి మీకు పూర్తి హక్కు ఉందని విజయలక్ష్మికి జడ్జి సూచించారు. విచారణ సమయంలో మీ క్లయింట్‌ (దర్శన్‌) హాజరు కావడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చారన్నారు. ప్రదూష్‌ జైల్లో మొబైల్‌ఫోన్‌తో ఇతరులను చట్టవిరుద్ధంగా సంప్రదించాడని, ఒత్తిడికిలోనై సాక్షిగా మారాడని చేసిన వాదనలను జడ్జి తిరస్కరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రదూష్‌ భార్యతో మాట్లాడారు, ఇందులో ఎలాంటి దోషం లేదన్నారు. మరుసటిరోజే సాక్షిగా మారేందుకు ప్రాసిక్యూషన్‌ అంగీకరించడంలో కూడా ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement