కర్ణాటక: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో బ్యారక్‌ను మార్చేందుకు 59వ సివిల్, సెషన్స్‌కోర్టు ఆమోదించింది. ఇప్పుడున్న బ్యారక్‌లో 30 మందికి పైగా ఉంటున్నారు, ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంతో ఇబ్బందిగా ఉందని పవిత్ర కోర్టులో అర్జీ వేసింది. దీంతో మరో బ్యారక్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు.
మళ్లీ హైకోర్టుకు దర్శన్
తనను వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేలా అనుమతించాలని రెండవ నిందితుడు, నటుడు దర్శన్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పిటిషన్‌ని భద్రతా కారణాల పేరుతో 59వ సీసీహెచ్ కోర్టు తిరస్కరించింది.
చదవండి : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్


