barracks
-
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
సాక్షి, హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో అఘోరీకి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారంటూ అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించగా.. అఘోరీ ప్రవర్తనపై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.కాగా, చంచల్ గుడ జైలును నిన్న(గురువారం) సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్‌ను పరిశీలించారు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్‌లో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది ఇవాళ అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.మహిళా సినీ నిర్మాత ఫిర్యాదుతో..పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈ ఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 308(5), 318(1), 351(3), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్ ఫస్ట్‌క్లాస్ జడ్జి ధీరజ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్‌లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
చెరిల్ జేమ్స్ మరణంపై మరోసారి విచారణ!
బ్రిటిష్ ఆర్మీకి చెందిన డీప్ కట్ సైన్య శిబిరాల్లో లైంగిక వేధింపుల సంస్కృతి కొనసాగుతున్నట్లు గతంలో ఎన్నో ఆధారాలు కనిపించినా పట్టించుకున్నవారే లేరు. అయితే సైన్యంలో శిక్షణ పొందుతూ 'చెరిల్ జేమ్స్' మరణించడం వెనుక దారుణ చరిత్ర ఉందని తాజా విచారణలో బయట పడుతోంది. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో అప్పట్లో కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా చెరిల్ జేమ్స్ మరణంపై న్యాయ విచారణ చేపట్టాలని ఆమె కుటుంబం తరపున మానవ హక్కుల సంఘం ముందుకు రావడంతో తిరిగి విచారణ ప్రారంభమైంది. 1995 లో డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతున్న చెరిల్ జేమ్స్ బుల్లెట్ గాయాలతో మరణించింది. అయితే అప్పటినుంచీ విచారణ చేపట్టిన కోర్టు... 2014 లో తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది. తాజాగా 18 ఏళ్ళ.. సోల్జర్ పీటర్ జేమ్స్ కేసులో ఆమె కుటుంబం తరపున లిబర్టీ మావన హక్కుల సంఘం... కోర్టు ముందు తన వాదనను వినిపించింది. బ్రియాన్ బార్కర్ క్యూసీ అధ్యక్షతన ప్రారంభమైన న్యాయ విచారణకు ముందు.. పీటర్ జేమ్స్ తండ్రి.. దేశ్... తన కుమార్తెతోపాటు, డీప్ కట్ లో వేధింపులతో మరణించిన యువసైనికులందరికీ న్యాయం జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు. డీప్ కట్ క్యాంపులో అదుపులేని మద్యం, డ్రగ్ సంస్కృతి కూడా కొనసాగుతున్నట్లు తమకు తెలిసిందని దేశ్ వెల్లడించారు. శిబిరంలో కొనసాగుతున్న ఇటువంటి దారుణ సంస్కృతే నలుగురు యువ సైనికుల మరణానికి కారణమైందన్నారు. ఐస్ బర్గ్ కు చివరి భాగంలో ఉండే డీప్ కట్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు ఇప్పటికైనా ప్రపంచానికి తెలియాలని, ఆ నలుగురు యువ సైనికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా డీప్ కట్ శిబిరంలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తమ కూతుర్ని కోల్పోయిన నేటి తరుణంలోనైనా అక్కడి దారుణ చరిత్ర బహిర్గతం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. 1995-2002 మధ్య చెరిల్ జేమ్స్ తో పాటు... బెంటన్ జేమ్స్, కొలిన్, జియోఫ్ గ్రే కూడా డీప్ కట్ లో తుపాకీ గాయాలతోనే మరణించారు. కుడికన్నుకు, ముక్కుకు మధ్య భాగంలో తగిలిన బుల్లెట్ గాయంతో 1995 లో పీటర్ జేమ్స్ మరణించింది. ఆ సమయంలో ఆమె... బ్రిటన్ సౌత్ వేల్స్ లంగోలెన్ లోని డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతోంది. 1995- 2002 కు మధ్య డీప్ కట్ లో బుల్లెట్ గాయాలతో మరణించిన యువ సైన్యం నలుగురిలో జేమ్స్ ఒకరు. అక్కడి వేధింపుల సంస్కృతి నేపథ్యంలోనే వారంతా మరణించినట్లు అంతా అనుకున్నా.. కోర్టుకు తగిన సాక్ష్యాలు మాత్రం అందించలేక పోయారు. అయితే మొదటి దర్యాప్తులో జరిగిన న్యాయ విచారణకు విరుద్ధంగా తాజా విచారణలో కనీసం 100 మంది సాక్షుల ఆధారాలను అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గంటపాటు జరిగిన విచారణలో ఏడుగురు సాక్షులను ప్రవేశ పెట్టి వారి సాక్ష్యాలను రికార్డు చేశారు. పీటర్ జేమ్స్ తన మరణానికి కొద్ది సమయం ముందు సీనియర్ల లైంగిక దాడికి గురైందన్న ఆరోపణ నేపథ్యంలో ఈ తాజా విచారణ ప్రారంభమైంది.