బెంగళూరు: అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన అసభ్య కామెంట్ల కేసులో తగ్గేదే లేదని చెప్పారు. గతంలో దర్శన్ అభిమానులపై పెట్టిన అశ్లీల సందేశాల కేసును వాపస్ తీసుకోబోనని రమ్య తెలిపారు. బెంగళూరులో కోర్టు ఆవరణలో నిందితుల కుటుంబసభ్యులు రమ్యను కలిసి క్షమించి, కేసు వాపస్ తీసుకోవాలని వేడుకున్నారు. కానీ రమ్య ససేమిరా అన్నారు. ఈ కేసు అందరికీ గుణపాఠం కావాలని రమ్య చెప్పినట్లు తెలిసింది.
మొబైల్‌ఫోన్ ఉందని ఓ మహిళను ఎలా కావాలంటే అలా కామెంట్ చేయవచ్చా? అని రమ్య వారిని ప్రశ్నించారు. కామెంట్ చేయడానికి ముందు వెయ్యి సార్లు యోచన చేయాలని, కేసు నడవాలి, తానే గెలపాలని, ఎన్నిసార్లు కోర్టు వాయిదాకు పిలిచినా వస్తానని ఆమె చెప్పారు. నిందితులను క్షమిస్తారా? అని జడ్జి కూడా ఆమెను విచారణలో అడిగినట్లు తెలిసింది.


