రష్యాతో యుద్ధం.. భారీగా ఖర్చులు.. ఆయుధాలు, డ్రోన్ల కోసం నిధుల కొరత.. ఇలాంటి పరిస్థితులతో ఉక్రెయిన్ సతమతమవుతోంది. దీంతో, ఉక్రెయిన్ ఓ సంచలన ఆలోచనకు తెరతీసింది. ఇప్పటివరకు నిషేధంగా ఉన్న పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసి.. అదే రంగం నుంచి పన్నులు వసూలు చేసి యుద్ధానికి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏటా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరడంతో పాటు.. వేలాది డ్రోన్ల కొనుగోలుకు ఆ డబ్బును ఉపయోగించే అవకాశం ఉందని ఉక్రెయిన్ ఎంపీలు చెబుతున్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏటా సుమారు 25 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.210 కోట్లకు పైగా) పన్ను ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ పార్లమెంట్ ఆర్థిక కమిటీ చైర్మన్ యారోస్లావ్ జెలెజ్ నియాక్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. పోర్నోగ్రఫీ పరిశ్రమను చట్టబద్ధ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా వచ్చే పన్ను ఆదాయంతో 30వేల వరకు డ్రోన్లను కొనుగోలు చేయవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పోర్నోగ్రఫీని తయారు చేయడం, కలిగి ఉండటం, పంపిణీ చేయడం చట్టవిరుద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, నిషేధం ఉన్నప్పటికీ అడల్ట్ కంటెంట్ పరిశ్రమ భారీగా కొనసాగుతోంది. అవినీతి పోలీసుల అండతో ఈ వ్యాపారం నడుస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
🇺🇦🔞 Ukraine Wants to Become a Global Porn Powerhouse to Fund the War
According to the Wall Street Journal, Ukraine is moving toward fully legalizing porn production, webcam work and prostitution as authorities look for new sources of wartime revenue.
The bill has already… pic.twitter.com/pnVMzH2U1W— dana (@dana916) September 6, 2026
పన్ను చెల్లింపులు ఇలా..
ఇదే సమయంలో ప్రభుత్వం అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల నుంచి పన్నులు వసూలు చేయడం ప్రారంభించడంతో కొత్త సమస్య తలెత్తింది. ఆదాయాన్ని ప్రకటించిన కొందరిపై పన్ను ఎగవేతతో పాటు పోర్నోగ్రఫీ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. పన్నులు చెల్లించకపోతే పన్ను నేరాలు.. చెల్లిస్తే పోర్నోగ్రఫీ చట్టం కింద కేసులు. ఇది విషాదకరమైన పరిస్థితి అని జెలెజ్ నియాక్ వ్యాఖ్యానించారు.
2023లో సుమారు 7,900 మంది ఉక్రెయిన్ పౌరులు OnlyFans ద్వారా 131 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే, ఆదాయాన్ని ప్రకటించిన కొందరు క్రియేటర్ల ఇళ్లపై పోలీసులు దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. OnlyFans క్రియేటర్ స్విత్లానా డ్వోర్నికోవా ఇంటిపై పోలీసులు దాడి చేసి 20 వేల డాలర్ల నగదు, ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆరోపించింది. కేసును ముగించేందుకు లంచం ఇవ్వాలని పోలీసులు సూచించారని కూడా ఆమె పేర్కొంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొందరు క్రియేటర్లు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టి ఇతర యూరప్ దేశాలకు వెళ్లినట్లు సమాచారం.
కొత్త ఆదాయ మార్గం..
ఈ వ్యవహారంపై అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెబ్‌సైట్‌లో పిటిషన్ కూడా దాఖలు చేసింది. తాను దాదాపు 9 లక్షల డాలర్ల పన్నులు చెల్లించినప్పటికీ నేరస్తురాలిగా చూడటం సరికాదని ఆమె వాదించింది. ఈ పిటిషన్‌కు వారం రోజుల్లోనే 25 వేలకు పైగా సంతకాలు వచ్చినట్లు జర్నల్ తెలిపింది. దీంతో పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసే ప్రతిపాదనపై పార్లమెంట్‌లో చర్చకు మార్గం సుగమమైంది. బిల్లు ఆమోదం పొందితే.. యుద్ధ సమయంలో కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న చట్టపరమైన గందరగోళానికి తెరపడే అవకాశం ఉందని ప్రతిపాదకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పుతిన్‌కు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?


