కైరో: హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవ రహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ఆదివారం ప్రకటించింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా సైన్యం ఖండించింది. ఇరాన్ చెప్పిందంతా అబద్ధమేనని కొట్టిపారేసింది. తమ నౌకపై ఎలాంటి దాడి జరగలేదని వివరించింది.
హార్మూజ్‌లో ఇరాన్‌కు చెందిన మూడు చమురు నౌకలపై అమెరికా దాడికి దిగిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా మరుసగా రోజే అమెరికా నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును పెంచుకొనేందుకు ప్రయత్నిస్తోంది.


