తమిళ వర్సటైల్ నటుడు సూరి, టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక మరియు విభిన్నమైన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'మండాడి'.
ప్రముఖ నిర్మాత ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.


