టెహ్రాన్: పశ్చిమ ఇరాన్‌లో ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్‌లోని కుర్దిష్ నగరం సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రాంతం టెహ్రాన్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉంది.
ట్యాంకర్‌లో బ్రేక్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక పేర్కొంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. హమదాన్ నుంచి మరీవాన్ వైపు ట్యాంకర్ వెళ్తుండగా, బ్రేక్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ తెలిపారు. ఇరాన్ ఇంటర్నేషనల్ తన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది.
2018లో ఇలాంటి ప్రమాదంలో 15 మంది మృతి
తాజా ఘటనకు ముందు 2018లో సనందజ్ సమీపంలో ఇలాంటి రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు ఇంధన ట్యాంకర్ అంతర్ నగర ప్రయాణికుల బస్సును ఢీకొనడంతో 15 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
ఇరాన్‌లో ప్రతి ఏడాది రోడ్డు, రవాణా ప్రమాదాల్లో 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అసురక్షిత వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, సరైన అత్యవసర సేవలు లేకపోవడం వల్ల ఆ దేశంలో రోడ్డు ప్రమాద మరణాల రేటు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
At least 11 people were killed and seven others injured after a fuel tanker crashed, exploded and caught fire on the Sanandaj-Hamadan road in western Iran, the governor of Sanandaj said Saturday.
The tanker was traveling from Hamadan toward Marivan when a technical failure in its… pic.twitter.com/lYntHeoNIu— Iran International English (@IranIntl_En) September 5, 2026


