వాషింగ్టన్: అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు చెందిన మూడు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా నేవీ యుద్ధ నౌకలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగడంతో ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వివరాలు తెలిపింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ. అమెరికా ఇరాన్ రెచ్చగొట్టే విధంగా చేసిన దాడులను తమ విమాన వాహక నౌక, గైడెడ్-మిస్సైల్ డ్రాయర్ విజయవంతంగా తిప్పికొట్టిందని పేర్కొంది. ఖర్గ్ ద్వీపం తీరంలో, జాస్క్ సమీపంలో ఉన్న M/T డౌనీ, M/T స్టార్క్1 అనే రెండు IRGC క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయని తెలిపింది. అలాగే ఒమన్ సముద్రంలో లోడ్ చేయకుండా ఉన్న మరో ట్యాంకర్‌పై సైతం దాడి చేసి నేలమట్టం చేశాయని పేర్కొంది.
ఈ విషయమై సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ "IRGCకి మా సందేశం స్పష్టంగా ఉండాలి. మీరు మా రెండు నౌకలపై కాల్పులు జరిపితే, మేము దానికి ప్రతిగా మీ వైపు నుంచి మూడింటిపై దాడి చేస్తాం. మరింత ఎక్కువ ఆర్థిక మూల్యాన్ని విధిస్తాము" అని కూపర్ పేర్కొన్నారు. అమెరికా బలగాలను రక్షించడానికి తాము ఏ క్షణంలోనైనా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, పర్షియన్ గల్ఫ్‌లోని ఖార్క్ ద్వీపం సమీపంలో ఉన్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ధృవీకరించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని, ట్యాంకర్ సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయిస్తున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించింది, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఖర్గ్‌కు ద్వీపానికి చెందిన ఒక AI-సృష్టించిన వీడియోను జతచేస్తూ ఖార్గ్ ద్వీపం "చిన్నాభిన్నం" అవుతోందని పేర్కొన్నారు.


